గజ్వేల్, అక్టోబర్ 26: బీఆర్ఎస్ హయాం లో సాగునీటి ప్రాజెక్టుల కోసం జిల్లాలో భూసేకరణ చేపట్టారు. భూనిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహా రం ప్రభుత్వం అందించింది. కోర్టు కేసులు, చిన్నపాటి కారణాలతో కొంతమందికి పరిహారం అందలేదు. వారు పరిహారం కోసం కాలం వెళ్లదీస్తున్నారు. భూనిర్వాసితులకు అండగా ఉంటామని ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దీక్షలు చేసిన కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక భూనిర్వాసితుల ఊసే ఎత్తడం లేదు.
దీంతో నిర్వాసితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూసేకరణ చేపట్టినప్పుడు బాధితుల పక్షాన ఏటిగడ్డ కిష్టాపూర్‌లో రెండు రోజులపాటు రేవంత్‌రెడ్డి నిరాహార దీక్ష చేశా రు. ప్రస్తుతం ఆయన సీఎంగా ఉండి కూడా నిర్వాసితుల గోడు పట్టించుకోవడం లేదు. అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ భూనిర్వాసితుల్లో కొంతమందికి రావాల్సిన ప్యాకేజీలపై నిర్ణయం తీసుకోవడం లేదు. ప్రభు త్వం ఎప్పుడు కరుణిస్తోందోనని నిర్వాసితులు ఆశతో ఎదురుచూస్తున్నారు.
మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో కొండపాక, తొగుట మండల్లాలోని 14గ్రామాలు ముం పునకు గురయ్యాయి. వీరందరికీ కేసీఆర్ ప్రభుత్వంలో గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని ముట్రాజ్‌పల్లి, సంగాపూర్ గ్రామాల మధ్య ఆర్అండ్ఆర్ కాలనీని నిర్మించారు. ఏటిగడ్డ కిష్టాపూర్‌లో 1253, లక్ష్మాపూర్‌లో 388, వేములఘాట్‌లో 1252, పల్లెపహాడ్‌లో 9 21, రాంపూర్‌లో 320, బ్రాహ్మణ బంజేరుపల్లిలో 267, ఎర్రవల్లిలో 800, సింగారం లో 330కి పైగా కుటుంబాలు ఉండగా, వీరి కోసం 2273 డబుల్ బెడ్రూం ఇండ్లను కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిఁది.
ఆయా గ్రామా ల్లో వ్యవసాయ భూమితోపాటు ఇతర ఆస్తులకు పరిహారం ఇవ్వడం ప్రతి కుటుంబానికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద రూ.7.50 లక్ష లు, ఇల్లు అందజేశారు. ఇల్లు వద్దనుకున్న వారికి ఓపెన్ప్లాట్ మరో రూ.5.04 లక్షలు అందజేశారు. 18 ఏండ్లు నిండిన మ గవారికి ఓపెన్ ప్లాట్, అమ్మాయిలకు పరిహారం చెక్కులు అందజేశారు. ఇదే తరహాలో కొండపోచమ్మ ముంపు గ్రామాల ప్రజలకు అందజేశారు. వారి కోసం 1141 డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించారు.