మనోహరాబాద్, నవంబర్ 2: బంధువుల ఇంట్లో శుభకార్యానికి బయలుదేరిన కాసేపటికే ట్రాక్టర్ రూపంలో ఆ కుటుంబాన్ని మృత్యువు కబలించింది. ఒకే ఇంట్లో నలుగురు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసుల వివరాల ప్రకారం… మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పోతారం గ్రామానికి చెం దిన మన్నె కుమార్, లావణ్య దంపతులకు సం జన, సహస్ర, శాన్విక ముగ్గురు సంతానం. వీరిలో మన్నె లావణ్య (30), ఆమె పిల్లలు సహస్ర (7), శాన్విక (6) సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మజీద్‌పల్లిలో బంధువుల ఇంట్లో ఆదివారం జరిగే శుభకార్యానికి శనివారం రాత్రి 7 గంటల సమయం లో బయలుదేరారు.
వీరిని లావణ్య బావ మన్నె ఆంజనేయులు(46) తన ద్విచక్ర వాహనంపై శభాష్‌పల్లి బస్టాప్ వద్ద దించేందుకు బయలు దేరాడు. గ్రామ శివారులో రైతులు రోడ్లపై వడ్లు ఆరబోసి ఎలాంటి హెచ్చరికలు ఏర్పాటు చేయకుండా ఉంచారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తు న్న ట్రాక్టర్ వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తూ ప్రాన్ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుభాష్‌గౌడ్ తెలిపారు.