మిల్లర్ల మాయాజాలం!
మెదక్ జిల్లాలో తరు చూ రైస్‌మిల్లర్ల అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. కొందరు రైస్‌మిల్లర్లు అక్రమాలకు పాల్పడినట్లు గతంలో అధికారులు గుర్తించారు.
- కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) పక్కదారి
- తనిఖీల్లో బయటపడుతున్న అక్రమాలు
- తూతూమంత్రపు తనిఖీలతో అధికారులు వదిలేస్తున్నారనే ఆరోపణలు
- కొల్చారంలోని రైస్‌మిల్లు ఘటనతో మరోసారి అక్రమాలు వెలుగులోకి
మెదక్, జూలై 21(నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలో తరు చూ రైస్‌మిల్లర్ల అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. కొందరు రైస్‌మిల్లర్లు అక్రమాలకు పాల్పడినట్లు గతంలో అధికారులు గుర్తించారు. కానీ, వారిపై చర్యలు తీసుకోలేదనే విమర్శలు ఉన్నాయి. దీంతో రైస్‌మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇంత జరుగుతున్నా మిల్లులు సీజ్ చేయడం లేదని, అధికారుల తనిఖీల్లో ధాన్యం రికార్డులకు భిన్నంగా నిల్వలు ఉన్నా చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ ధాన్యాన్ని మిల్లర్లు నేరుగా విక్రయించినా అధికారులు కేసులు నమోదు చేయలేదని తెలుస్తున్నది.
ప్రభుత్వం రైస్మిల్లరకు కేటాయించిన ధాన్యం పూర్తిగా మిల్లుల్లో నిల్వ ఉంచకుండా, కొంత బహిరంగ మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. రికార్డుల్లో ధాన్యం ఉన్నట్లు చూపించి, గోదాముల్లో మాత్రం నిల్వలు లేకపోవడం తనిఖీల్లో బయటపడుతున్నది. తూకాల్లో తేడాలు, తేమ శాతం పేరుతో అధిక కోతలు, నాసిరకం ధాన్యంతో మార్పిడి చేసి మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిసింది. ధాన్యం బస్తాలకు సంబంధించిన వివరాలు రిజిస్టర్లు, ఆన్లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలి. కానీ, రైస్‌మిల్లర్లు ఎవరు ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదని తెలిసింది. రికార్డుల్లో చూపి న నిల్వలకు గోదాముల్లో ఉన్న వాస్తవ నిల్వలకు వ్యత్యాసం ఉండడంతో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు.
బియ్యం రికవరీలోనూ అక్రమాలు..
కస్టమ్స్ మిల్లింగ్ విషయంలో రైస్‌మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నట్లు తనిఖీల్లో బయటపడుతున్నది. కొందరు మిల్లర్లు రికవరీ తక్కువగా వచ్చినట్లు చూపిం చి, మిగిలిన బియ్యం బహిరంగ మార్కెట్లో అమ్ముతున్నారు. దీంతో ప్రభుత్వానికి రూ. కోట్ల నష్టం జరుగుతున్నది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, పౌర సరఫరాల శాఖ అధికారులు రైస్‌మిల్లుల్లో రికార్డులు, స్టాక్ రిజిస్టర్లు, ఆన్లైన్ నమోదు వివరాలు గోదాముల్లోని నిల్వలను పరిశీలించి అ క్రమాలు జరిగినట్లు గుర్తిస్తున్నారు.
ధాన్యం బస్తాల లెక్కిం పు, తూకాల పరిశీలన, బియ్యం రికవరీ వివరాలు తనిఖీల్లో వ్యత్యాసాలు వస్తుండంతో కేసు నమోదు చేశారు. ప్రభు త్వం ధాన్యం అక్రమలు నివారించేందుకు రైస్‌మిల్లుల్లో ముమ్మర తనిఖీలు చేయడంతో పాటు డిజిటల్ స్టాక్ పర్యవేక్షణ, జీపీఎస్ ఆధారిత రవాణా పర్యవేక్షణ, సీసీ కెమెరాలు నిఘా ఏర్పాటు చేయాలి.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 14-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

