జిన్నారం, జనవరి 2: సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ప్రభుత్వ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. కార్పొరేట్ దవాఖానలకు ధీటుగా ప్రభుత్వ దవాఖానల్లో ఆధునిక సదుపాయాలున్నాయని, అనుభవజ్ఞులైన వైద్యులు, క్లిష్టమైన శస్త్ర చికిత్సలు ఇక్కడే జరుగుతున్నాయన్నారు. జిన్నారం ప్రభత్వ దవాఖాన ఆవరణలో రూ.కోటీ 56లక్షల అంచనా వ్యయంతో ఆధునిక ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణానికి ఎమ్మెల్యే సోమవారం స్థానిక నాయకులతో శంకుస్థాపన చేశారు. అదేవిధంగా సోలక్పల్లిలో రూ.కోటి 10లక్షలతో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) భవన నిర్మాణానికి, జిన్నారం దర్గా కాలనీలో రూ.20 లక్షలతో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గరీబ్ షావళి దర్గాను స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జిన్నారంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి మాట్లాడారు. ప్రత్యే క రాష్ట్రం ఏర్పడకముందు తెలంగాణలో అప్పటి ప్రభుత్వాలు వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడంలో వివక్షను చూపాయన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ నిధులతో జిల్లాకో వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. పారిశ్రామిక రంగంతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకెళ్తున్న పటాన్చెరులో కార్మికులు, పేద కుటుంబాల కోసం రూ.300 కోట్లతో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణం పనులు ప్రారం భం కానున్నట్లు చెప్పారు. బస్తీ ప్రజల కోసం బస్తీ దవాఖానలు ఏర్పాటు అవుతున్నాయన్నారు. ప్రజలు ప్రైవేటు దవాఖానలను ఆశ్రయించొద్దని, ప్రభుత్వ దవాఖానల్లోనే అన్ని సదుపాయాలు, అనుభవజ్ఞులైన వైద్యులున్నారని గుర్తు చేశారు. వైద్య రంగంలో ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాల మూలంగా ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు 90శాతం పెరిగాయన్నారు. జిన్నారంలో నిర్మించే దవాఖానను నాణ్యతగా త్వరగా పూర్తి చేసే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. పీఏసీఎస్ భవనం, వాటర్ ట్యాంకును నాణ్యతగా నిర్మించాలని అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించారు.
అనంతరం ఎమ్మెల్యే, ఇతర ముఖ్య నాయకులను స్థానికులు శాలువా, పూలమాలలతో సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు వెంకటేశంగౌడ్, తహసీల్దార్ దశరథ్‌సింగ్, ఎంపీడీవో రాములు, ఆర్ఐ జయప్రకాశ్‌నారాయణ, సర్పంచ్‌లు లావణ్యాశ్రీనివాస్రెడ్డి, దాసరిశ్రీకాంత్రెడ్డి, ఎంపీటీసీలు స్వాతిప్రభాకర్రెడ్డి, లావణ్యానరేశ్, సర్పంచ్‌లు శివరాజ్, ఆంజనేయులు, జనార్దన్, ఖదీర్, సోలక్పల్లి పీఏసీఎస్ చైర్మన్ గోపాల్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు సురేందర్‌గౌడ్, రాములుయాదవ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాజేశ్, మండల కోఆప్షన్ సభ్యుడు ఇంతియాజ్, నాయకులు సార నరేందర్, గద్దె నర్సింహ, ప్రభార్‌రెడ్డి, బత్తుల మహేశ్, ఆదిరామకృష్ణ, బల్బీర్‌సింగ్, శ్రీనివాస్‌రెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి, కృష్ణాగౌడ్, శ్రీధర్‌గౌడ్, మందరమేశ్, శ్రీనివాస్‌గౌడ్, నర్సింగ్‌రావు, గాండ్ల శ్రీనివాస్, మోహన్, గోపీగౌడ్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.