నర్సాపూర్/శివ్వంపేట, జూలై 13: రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా గాలికొదిలేసిందని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రైతులకు సాగునీరు ఇవ్వాలని ప్రతిపక్షం కోరితే సీఎం రేవంత్‌రెడ్డి అసహనం వ్యక్తం చేయడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో రైతుల పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఆరోపించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కన్నెపల్లి పంపుహౌజ్‌ను వెంటనే నడిపి నీరందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి ఆనవాళ్లు చెరిపివేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. రైతుల పంట పొలాల్లోకి నీరు పారించాలని ప్రతిపక్ష నాయకులు కేటీఆర్, హరీశ్‌రావు కోరితే వారి రక్తాన్ని పారిస్తా అని సీఎం మాట్లాడటం తగదన్నారు. రైతుల సమస్యలపై త్వరలోనే ‘హల్దీబచావో’ కార్యక్రమాన్ని చేపడుతామని ప్రకటించారు.ఆరుగురిని హత్య చేసిన ఘటన రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యానికి నిదర్శనమన్నారు.
సీఎంగా, హోంమంత్రిగా రేవంత్‌రెడ్డిగా పూర్తిగా విఫలమయ్యారని, బాధిత కుటుంబానికి రూ. కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హ యాంలో తెలంగాణ పోలీసింగ్‌కు దేశవ్యాప్తంగా ఉత్తమ గుర్తింపు లభించిందని, ప్రస్తు తం శాంతిభద్రతల పరిస్థితి దిగజారిందన్నారు. అంతకుముందు సర్‌పై నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. సమావేశంలో రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, సర్ నియోజకవర్గ ఇన్చార్జి నరహరి, ఎంపీపీల ఫోరం మాజీ జిల్లా అధ్యక్షుడు కల్లూరి హరికృష్ణ, జడ్పీ కోఆప్షన్ మాజీ సభ్యుడు మన్సూర్, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ గొర్రె వెంకట్‌రెడ్డి, నర్సాపూర్ మండలాధ్యక్షుడు బోగ చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షుడు పంబళ్ల భిక్షపతి, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.