మెదక్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ):మెతుకు సీమ మెదక్‌లో మెడికల్ కళాశాల ఏర్పాటు ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే, మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. గురువారం ఆమె‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ..జిల్లాల పునర్విభజనలో భాగంగా మెదక్‌ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి అన్ని హంగులు కల్పించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని గుర్తుచేశారు.
మొదటి విడతలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మెడికల్ కళాశాలలను మంజూరు చేయ గా, రెండో విడతలో మెదక్‌కు మెడికల్ కళాశాల మం జూరు చేయాలని మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. పలుమార్లు అసెం బ్లీ సమావేశాల్లో కూడా మెదక్ వెనుకబడి జిల్లా అని, మెదక్ కేంద్రంగా ఏర్పడిన తర్వాత అన్ని హంగులు కల్పిస్తున్నామని, మెడికల్ కళాశాల మంజూ రు చేస్తే ఈ ప్రాంత విద్యార్థులకు చదువుకునే అవకాశం దక్కుతుందని ప్రస్తావించిన విషయాన్ని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ మెదక్‌కు మెడికల్ కళాశాల కోసం రూ.180 కోట్లు మంజూరు చేస్తూ 100 ఎంబీబీఎస్ సీట్లు కేటాయించారన్నారు.
దీని కోసం మెదక్ శివారులోని మాతాశిశు సంరక్షణ కేం ద్రం ప్రాంతంలో 14 ఎకరాలు స్థల సేకరణ చేయగా, అప్పటి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా శంకుస్థాపన చేశామన్నారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెదక్ మెడికల్ కళాశాలకు 100సీట్లలో 50 సీట్లు కేటాయించారని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో మెడికల్ కళాశాలకు 50 సీట్లను తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ ప్రాంత ప్రజలతోపాటు విద్యార్థులను కాంగ్రెస్ ప్రభుత్వం మో సం చేసిందని పద్మాదేవేందర్‌రెడ్డి ఆరోపించారు.