మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 17: తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలనలో మత కలహాలు ఏర్పడి అత్యాచారాలు, హత్యలు పెరిగి శాంతిభద్రతలు లోపించాయని మాజీమంత్రి హరీశ్‌రావు అన్నా రు. మంగళవారం మెదక్ బీఆర్ఎస్ కార్యాలయం లో మాజీఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. తొమ్మిది నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1900 అత్యాచారాలు, 206 హత్యలు జరిగాయన్నారు. ప్రతిపక్షాలపై కేసులు, ప్రతిపక్ష నేతల ఇండ్లపై, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాడులు చేయిస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం లా అం డ్ ఆర్డర్‌ను గాలికొదిలేసి పగ, ప్రతికారాలు తీర్చుకుంటుందన్నారు. రాష్ట్రంలో మైనార్టీలకు, మహిళలకు భద్రత లేకుండా పోయిందని, ఎస్సీ,ఎస్టీ మహిళలపై సైతం అత్యాచారాలు నిత్యకృత్యమయ్యాయన్నారు.
ప్రభుత్వ వైఫల్యం వల్ల మత విద్వేషాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. మెదక్‌తోపాటు జైనూర్, వనపర్తి, దౌల్తాబాద్, చెం గిచెర్ల, నిజామాబాద్, రేవ్పూల్ ప్రాంతాల్లో మతకలహాలు జరిగినా ఇప్పటివరకు సీఎం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించలేదన్నారు. మొయినాబాద్‌లో మసీద్‌ను రియల్ మాఫీయా కూల్చివేసిందని, తొమ్మిది నెలల్లో నాలుగైదు మసీదులు కూలాయన్నారు. ఈ ఘటనలు హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయన్నారు. మతకలహాలలో హిందూ, ముస్లింల ఆస్తులు నష్టపోయాయని వారికి సీఎం రిలీఫ్‌ఫండ్ నుంచి బడ్జెట్ కేటాయించి బాధితులకు నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మతకలహాల వల్ల రాష్ర్టాభివృద్ధి కుంటుపడుతుందని, అలాంటి ప్రాంతాల్లోని పోలీసులపై ప్రభు త్వం చర్యలు తీసుకోవాలన్నారు.
నేటివరకు ఫీస్ మీటింగ్ పెట్టకుండా బాధితులకు భరోసా కల్పించకుండా ప్రభుత్వం ఏమి చేస్తుందని ప్రశ్నించా రు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి మతకలహాలు జరుగలేదన్నారు. మైనార్టీ పాఠశాల మెస్‌చార్జీలు ఇవ్వడం లేదన్నారు. అసెంబ్లీలో చెప్పిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్‌ను ఎం దుకు ఖర్చుపెట్టడం లేదన్నారు. మైనార్టీ మినిష్టర్‌ను నియమించాలని డిమాండ్ చేశారు. షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకాల ద్వారా నగదుతో పాటు తులం బంగారం అందజేస్తానన్న ముఖ్యమంత్రి మాటలు ఏమయ్యాయని హారీశ్‌రావు ప్రశ్నించారు.సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, శ్రీనివాస్, జయరాజ్, బీఆర్ఎస్ నాయకులు లింగారెడ్డి, ప్రభురెడ్డి, కృష్ణాగౌడ్, శంకర్, జుబేర్, సాయిలు, ప్రభులింగం, కిషన్, కిరణ్, మల్లేశం పాల్గ్గొన్నారు.