తొగుట : భిన్నత్వంలో ఏకత్వంలా భారతీయ సంస్కృతిలో మతసామరస్యానికి (Religious Harmony) మహోన్నతమైన స్థానం ఉందని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని వెంకట్రావుపేటలో రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లీం సోదరులకు ఇఫ్తార్ విందు( Iftar Party ) నిర్వహించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మతాలు వేరైనా మనసులు ఒక్కటైతేనే సమాజం అభివృద్ధి చెందుతుందని, దేవాలయంలో ఘంటారావం, మసీదులో ప్రార్థనల ధ్వని, గిర్జా మ్రోగే గంటలు ఇవన్నీ మన దేశ ఆత్మను ప్రతిభింబించే స్వరాలని, ఐఖ్యతకు పిలుపునిస్తాయన్నారు. ఇఫ్తార్ అనేది కేవలం ఉపవాస విరమణకాదని, సహనానికి, క్షమకు, దానానికి, ప్రేమకు ప్రతీకని పేర్కొన్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో మతసామరస్యం కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు బండారు స్వామిగౌడ్, పులిగారి శివయ్య, వార్డు సభ్యులు జహంగీర్, పిట్ల వెంకటేష్, మిద్దె శ్రీనివాస్, ఎంగలి నరేందర్, వడ్డె నర్సింహులు, పులిగారి నర్సింహులు, జీడిపల్లి గోవర్ధన్ రెడ్డి, , పిట్ల వెంకటయ్య, ఈదుగల్ల పర్శరాములు, సుతారి రాములు, కనకరాజు, పాత్కుల బాలేష్, నవీన్, లక్ష్మణ్, చంద్రం, షాదుల్, నజీమ్, ఆజాం, స్వామి, నాగయ్య, బాలచంద్రం తదితరులు పాల్గొన్నారు.