గుమ్మడిదల,మార్చి 2: ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా జీహెచ్ఎంసీ డంపింగ్‌యార్డు ఏర్పాటు చేయడంపై పోరాటాలు కొనసాగిస్తామని, అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామని జేఏసీ నాయకులు తెలిపారు. డంపుయార్డుకు వ్యతిరేకంగా ఆదివారం గుమ్మడిదల మున్సిపాలిటీలో 20వ రోజు రిలే నిరహార దీక్షలో కొనసాగింది. దీక్షలో కురుమ సంఘం సభ్యులు కూర్చున్నారు. నల్లవల్లి, కొత్తపల్లి గ్రామాల్లో 26వ రోజు రిలే నిరాహార దీక్షలో యువకులు పాల్గొన్నారు.
జేఏసీ అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి, జేఏసీ నాయకులు గోవర్ధన్‌రెడ్డి. ఎం. నరేందర్‌రెడ్డి, పుట్టనర్సింగ్రావు, నాగేందర్‌గౌడ్, రైతు సంఘం జాతీయ నాయకుడు మంద బలరాంరెడ్డి, రైతు సంఘం అధ్యక్షుడు సదానందరెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షుడు మద్దుల బాల్‌రెడ్డి,ఆలేటి శ్రీనివాస్‌రెడ్డి, చక్రపాణి తదితర జేఏసీ నాయకులు పాల్గొన్నారు.
జేఏసీ ఆదేశాల మేరకు మండలంలోని 13 గ్రామపంచాయతీల్లో డంపింగ్‌యార్డుకు వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహించి సంతకాల సేకరణ చేయాలని నిర్ణయించారు. దీని కోసం 13 గ్రామ పంచాయతీలకు తీర్మానాల కాపీలను అందజేశారు.
ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లో డంపుయార్డును ఏర్పాటు కానివ్వమన్నారు. డంపుయార్డుతో ఈ ప్రాంతం కాలుష్యమయంగా మారుతుందన్నారు. వ్యవసాయం దెబ్బతింటుందని, ప్రజలకు అన్ని విధాలుగా నష్టం చేకూరుస్తుందని పేర్కొన్నారు. పర్యావరణ చట్టాల ప్రకారం ఎలాంటి ప్రజాభిప్రాయసేకరణ, గ్రామసభల నుంచి ఎలాంటి తీర్మానాలు లేకుండా డంపింగ్‌యార్డు ఏర్పాటు చేయరాదని, ప్రభుత్వం తీరుపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని జేఏసీ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో లక్ష్మీనారాయణ, పి.శ్రీనివాస్‌రెడ్డి, భిక్షపతిరెడ్డి, తులసిదాస్, భాస్కర్‌గౌడ్, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.