శివ్వంపేట, డిసెంబర్ 4 : పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో అభ్యర్థులకు సందేహాలు రేకెత్తించకుండా అధికారులు స్పష్టతతో వ్యవహరించాలని నర్సాపూర్ ఆర్డీవో మహిపాల్ రెడ్డి ఆదేశించారు. గురువారం మెదక్ జిల్లా శివ్వంపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద నామినేషన్ కౌంటర్లను రెండవ రోజు ఆర్డీఓ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభ్యర్థికి సంబంధించిన రిజర్వేషన్ సరైనదో కాదో, అలాగే కుల ధృవీకరణ పత్రం, ఇంటి పన్ను రసీదు, ఆధార్ కార్డు పరిశీలిస్తే చాలు అన్నారు.
అదనం ప్రశ్నలు వేసి అభ్యర్థులను గందరగోళానికి గురి చేయకూడదు అని నామినేషన్ స్వీకరించాలని అధికారులకు స్పష్టం చేశారు. అభ్యర్థులు నామినేషన్ స్వీకరించాలన్నారు. ప్రతి కౌంటర్ వద్ద స్పష్టమైన సమాచారాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. నామినేషన్ ప్రక్రియలో క్రమశిక్షణ పాటించాలని ఆర్డీవో సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ కమలాద్రి, ఎంపీడీవో వెంకట లక్ష్మమ్మ, ఎస్ఐ మధుకర్ రెడ్డి, ఎంపీవో తిరుపతి రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.