 
                                                            రాయపోల్, అక్టోబర్ 31 : ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని మండల విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం రాయపోలు మండలం వడ్డేపల్లి ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలన్నారు. అలాగే పదవ తరగతి విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచే విధంగా ఉపాధ్యాయులందరూ కృషి చేయాలన్నారు. ఆయన వెంట పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోవర్ధన్, ఉపాధ్యాయులు సుధాకర్ రెడ్డి తదితరులున్నారు.
 
                            