Anganwadi Children | శివ్వంపేట, ఆగస్టు 28 : అంగన్వాడీ విధుల పట్ల నిర్లక్ష్యం వహించి పిల్లల అస్వస్థతకు కారణమైన అంగన్వాడీ టీచర్ నవీన, ఆయా రాజమ్మలను మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ విధుల నుంచి తొలగించినట్లు నర్సాపూర్ ఐసీడీఎస్ సీడీపీఓ హేమ భార్గవి తెలిపారు. గురువారం శివ్వంపేట మండలం రత్నాపూర్లో గ్రామస్తులతో సీడీపీఓ హేమ భార్గవి శివ్వంపేట సెక్టార్ సూపర్వైజర్ సంతోషతో కలిసి సమావేశం నిర్వహించారు.
రత్నాపూర్ అంగన్వాడీ కేంద్రంలో తాగునీటిలో సుందెలుక పడడంతో ఆ నీళ్లు తాగిన ఎనిమిది మంది చిన్నారులు అస్వస్థతకు గురికాగా జిల్లా కలెక్టర్, DMHO, మహిళా శిశు సంక్షేమ శాఖ RJD, జిల్లా DWO , అధికార యంత్రాంగం తక్షణం అప్రమత్తమై పిల్లలకు మూడు రోజులపాటు మెరుగైన వైద్యం అందించి వారిని సంపూర్ణ ఆరోగ్యం గా ఉండేలా కృషి చేశారని అన్నారు.
ఈ విషయమై అధికారుల ఆదేశాల మేరకు రత్నాపూర్లో పిల్లల తల్లిదండ్రులతోపాటు గ్రామస్తులతో సమావేశం నిర్వహించగా అంగన్వాడీ టీచర్ నవీన, ఆయా రాజమ్మలపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు టీచర్, ఆయాను విధుల నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు.
రత్నాపూర్ అంగన్వాడీ కేంద్రం బాధ్యతలను మరో అంగన్వాడీ టీచర్‌కు అప్పగించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పూర్తిస్థాయిలో అంగన్వాడీ టీచర్, ఆయాలను నియమించేందుకు కృషి చేస్తామని సీడీపీఓ హేమ భార్గవి తెలిపారు.
Cybercrime | సైబర్ వలలో ఆలయ ఉద్యోగి.. లక్షల్లో మోసపోయిన బాధితుడు
Clay Ganesh | కండ్లకు గంతలు కట్టుకొని.. కేవలం 54 నిమిషాల్లో గణనాథుని విగ్రహం తయారీ
Kamareddy Rains | రెస్క్యూ టీంను పంపించండి సార్.. కామారెడ్డి కాలనీల్లో వరద ముంపు బాధితుల ఆర్తనాదాలు
Watch: పసి బిడ్డకు టీకా వేసేందుకు.. ఉప్పొంగుతున్న వాగును దాటిన ఆరోగ్య కార్యకర్త