Sri sita ramula Pratishta | పెద్దశంకరంపేట, ఏప్రిల్ 20 : సీతారామచంద్రస్వామి పున: ప్రతిష్టాపన మహోత్సవం మూడు రోజులపాటు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు గుజ్జరి కనకరాజు తెలిపారు.
ఈ నెల 21 నుండి 23 వరకు ఈ మహోత్సవ కార్యక్రమం జరుగనున్నట్టు చెప్పారు. ఈ నెల 21న గణపతి పూజ, పుణ్య : వచనం, ఈ నెల 22న లక్ష పుష్పార్చన, ఈ నెల 23న యంత్ర ప్రతిష్టా, మూర్తి ప్రతిష్టా, ద్వజ ప్రతిష్టా. ప్రాణ ప్రతిష్టా తదితర కార్యక్రమాలు నిర్వహిండం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమానికి రంగం పేట పీఠాదిపతి మాధవానంద సరస్వతీ స్వామి హజరై ప్రవచనాలు గావిస్తారన్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హజరై తీర్థప్రసాదాలు తీసుకోవాలని కనకరాజు కోరారు.
CC cameras | నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం
Indigo flight | విమానాన్ని ఢీకొట్టిన టెంపో ట్రావెలర్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?