రామాయంపేట, మే 21 : వానాకాలం పంటలకు రైతులకు ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు దుకాణాలలో సిద్ధంగా ఉండాలని రామాయంపేట వ్యవసాయశాఖ డివిజన్ ఇంచార్జి ఏడీఏ రాజ్నారాయణ పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎరువులు, విత్తనాల దుకాణాలలోని రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతు వానాకాలం పంటల కోసం ప్రతి డీలర్ తమ దుకాణాలలో రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు, పురుగు మదులు కూడా అందు బాటులో ఉంచాలన్నారు.
అంతే గాకుండా ప్రతి డీలర్ తమ దుకాణం లైసెన్సును రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసిన రైతులకు కచ్చితంగా రసీదు ఇవ్వాలన్నారు. రసీదులు ఇవ్వని వ్యాపారుల లైసెన్సులను రద్దుచేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటి నుండి ప్రతి డీలర్ తమ షాపులలో పంటలకు ఉపయోగపడే విత్తనాలను నిల్వ చేసి ఉంచుకోవాలన్నారు.