Narsapur | మానసికంగా వేధిస్తున్న డిప్యూటీ తహసిల్దార్‌పై చర్యలు తీసుకోవాలి
ఎలక్షన్ డ్యూటీ డిప్యూటీ తహసిల్దార్ విజయక్ష్మి తనను మానసికంగా వేధిస్తున్నారని ఆర్డీవో కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ పద్ధతిన విధులు నిర్వర్తిస్తున్న ఎలక్షన్ ఆపరేటర్ ఎం. రాజ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
నర్సాపూర్, ఫిబ్రవరి27: ఎలక్షన్ డ్యూటీ డిప్యూటీ తహసిల్దార్ విజయక్ష్మి తనను మానసికంగా వేధిస్తున్నారని ఆర్డీవో కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ పద్ధతిన విధులు నిర్వర్తిస్తున్న ఎలక్షన్ ఆపరేటర్ ఎం. రాజ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా ఆర్డీవో కార్యాలయంలో ఎలక్షన్ ఆపరేటర్‌గా ఔట్ సోర్సింగ్ పద్ధతిన విధులు నిర్వర్తిస్తున్నానని వెల్లడించారు. పై అధికారి అయిన నయాబ్ తహసిల్దార్ విజయలక్ష్మి తనను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయాడు. గత 4 నెలలుగా ఉద్యోగ రీత్యా ఔట్ సోర్సింగ్ అని చిన్న చూపు చూస్తు తిట్టడం, అందరి ముందు అవహేళన చేస్తూ అవమానించడం చేస్తుందని ఆరోపించాడు.
ఉన్నత స్థాయి అధికారి అని స్థాయి మరిచిపోయి తనపై చెడుగా ప్రచారం చేయడం చాలా బాధగా ఉందని తెలిపారు. దీని ద్వారా తనకు, తన కుటుంబానికి మానసిక ప్రశాంతత లేకుండా చేస్తున్నదని వాపోయాడు. రెండు నెలల క్రితం 10 రోజులు సెలవు కూడా పెట్టడం జరిగిందని, అయినా తనలో ఎలాంటి మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన బాధను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయిన ఎవరు పట్టించుకోవడం లేదని వెల్లడించారు.
విధి నిర్వహణలో పనులు సక్రమంగా చేస్తున్న తను చాలా రకాలుగా వేధిస్తున్నారని తెలిపారు. తనకు సంబంధం లేని పని విషయంలో కూడా చొరవ తీసుకొని తనను టార్గెట్ చేస్తుందని పేర్కొన్నారు. తను చేయాల్సిన పనులను కూడా తనతో చేయిస్తుందని, చివరకు బాత్రూమ్ వెళ్లాలన్న అనుమతి తీసుకోవాలని చిత్రవిచిత్రాలుగా వేధిస్తుందన్నారు. ఈ ఇబ్బందులు తట్టుకోలేక రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని, పై అధికారులు స్పందించి తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

