Drugs | నర్సాపూర్, నవంబర్ 8 : ఓ రూట్ వాచ్ బస్సు(లగ్జరీ)లో పప్పి స్ట్రా పౌడర్ (ఓ రకమైన డ్రగ్స్, నల్లమందు)ను తరలిస్తుండగా ఎక్సైజ్ పోలీసులు నిఘా వేసి పట్టుకున్నారు. ఈ సంఘటన నర్సాపూర్ ఎక్సైజ్ పరిధిలోని తూప్రాన్ మండలం మనోహరాబాద్ జాతీయ రహదారి -44 టోల్ ప్లాజా వద్ద శనివారం చోటుచేసుకుంది.
ఎక్సైజ్ సీఐ గులాం ముస్తఫా మాట్లాడుతూ.. మనోహరాబాద్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేపట్టగా ఓ రూట్ వాచ్ బస్సులో 430 గ్రాముల పప్పి స్ట్రా పౌడర్ గుర్తించడం జరిగింది. ఈ డ్రగ్‌ను తీసుకువస్తున్న రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన బాలేసర్ పోస్ట్, బోధ్పూర్ జిల్లా బెల్వారనాజీ గ్రామానికి చెందిన రావల్సింగ్ (33) అనే బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ పౌడర్ గసగసాల ద్వారా తయారీచేయడం జరుగుతుందని, ఇదో రకమైన మత్తుపదార్ధమని, ఇది ఆరోగ్యానికి ఎంతో హానికరమని వెల్లడించారు.
రాజస్థాన్‌లో ఈ మత్తుపదార్ధాన్ని రూ.800 లకు దొరికితే మన రాష్ట్రంలో సుమారు రూ.8000 వరకు విక్రయించి క్యాష్ చేసుకుంటారని తెలిపారు. మత్తుపదార్ధాలను విక్రయించినా, వాడినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేయడం జరిగిందని వెల్లడించారు. ఈ రైడ్‌లో నర్సాపూర్ ఎక్సైజ్ సీఐ గులాం ముస్తఫా, పీఆండ్ ఈఎస్ఐ ఎండి ఖాజా అజీజ్ అహ్మద్, పీఆండ్ ఈఎస్ఐ రాఘవేందర్రావు, పీఆండ్ ఈసీ అనిల్, సత్తయ్య, ప్రభాకర్, రాజశేఖర్ పాల్గొన్నారు.
రూ.కోట్లతో కొలువులు.. నిట్ విద్యార్థికి రూ.1.27 కోట్ల ప్యాకేజీ
ఇందిరమ్మ బిల్లుల్లో తిరకాసు.. నగదు చెల్లింపులో మాట మార్చిన సర్కారు
PDSU | పీడీఎస్‌యూ రాష్ట్ర మహాసభల పోస్టర్ల ఆవిష్కరణ