రామాయంపేట, మే 04 : రేపటి నుంచి రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం అవుతున్నాయని కళాశాల ప్రిన్సిపాల్ మల్లేశం ఒక ప్రటనలో పేర్కొన్నారు. రామాయంపేట, నిజాంపేట మండలాలలోని పదవ తరగతిలో ఉత్తీర్ణులై విద్యార్థులు నేరుగా సోమవారం నుంచి కళాశాలకు వచ్చి అడ్మిషన్లు పొందాలన్నారు. ప్రభుత్వ కళాశాలలో నాణ్యమైన బోధన ఉంటుందని ఎలాంటి ఫీజులు గాని ఇతర ఖర్చులు ఏవికూడా ఉండవన్నారు. అడ్మిషన్లు అయిన విద్యార్థులకు ఉపకార వేతనాలు కూడా ప్రభుత్వం అందజేస్తుందన్నారు. అందు కోసం ప్రతి విద్యార్థి ప్రభుత్వ కళాశాలలోనే విద్యను చదవాలన్నారు.
ఇవి కూడా చదవండి..
EAPCET | మౌస్ పనిచేస్తలేదని చెబితే.. నా బదులు వాళ్లే పరీక్ష రాశారు
Cotton Procurement | పత్తి కొనుగోళ్లలో అక్రమాలు?.. ఎన్నడూ లేని విధంగా భారీగా టీఆర్ల జారీ!