గుడిపల్లి, ఫిబ్రవరి 19 : యూరియా యాప్ను రద్దు చేసి, ఎలాంటి షరతుల్లేకుండా రైతులకు యూరియా అందించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ డిమాండ్చేశారు. రైతులు ఎదుర్కొంటున్న యూరియా సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మండలంలోని అంగడిపేట ఎక్స్ రోడ్డు వద్ద రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా రవీంద్రకుమార్ మాట్లాడుతూ.. ఆన్లైన్ యూరియా బుకింగ్ విధానం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.