మెదక్ అర్బన్, జూలై 26 : మెదక్-రామాయంపేట రోడ్డుపై గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో చిరుత పులి దుర్మరణం చెందింది. ఆదివారం ఉదయం మెదక్ జిల్లా హవేళిఘనపూర్ మండలం గంగాపూర్ రాజేశ్వర్ స్వామి దేవాలయ సమీపంలో రోడ్డుపై ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. గంగాపూర్ శివారు అటవీ ప్రాంతం కావడం..
సమీపంలో చెరువు ఉండటంతో నీటికోసం వచ్చిన చిరుత ఆపై రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొని ఉంటుందని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. చిరుత కళేబరాన్ని పోస్టుమార్టం కోసం రామాయంపేట మండలం అక్కన్నపేట అర్బన్ ఫారెస్ట్ పార్కుకు తరలించారు. చిరుత మృతిపై మెదక్ డీఎఫ్వో జోజీ అధికారులతో ఆరా తీశారు.