రామాయంపేట, జూన్ 19 : ప్రభుత్వ కళాశాలలోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుందని రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంచార్జి ప్రిన్సిపల్ గూడూరి మల్లేశం పేర్కొన్నారు. గురువారం ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉచితంగా ప్రభుత్వం అందజేసిన పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు అనుబవజ్ఞులైన అధ్యాపకులతో బోధిస్తారన్నారు. ఉపకార వేతనాలు కూడా విద్యార్థులకు ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో లెక్చరర్లు బాలప్రకాశ్, యాదగిరి, స్వామి తదితరులు ఉన్నారు.