మెదక్ రైల్వేస్టేషన్‌కు మహర్దశ
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద మెదక్ రైల్వేస్టేషన్ ఎంపికైంది. దేశంలోని 500 రైల్వేస్టేషన్ల ఆధునికీకరణలో భాగంగా మెదక్ రైల్వేస్టేషన్‌కు కూడా స్థానం దక్కడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకోసం కేంద్రం రూ. 15.29 కోట్లు కేటాయించింది.
- అమృత్ భారత్ స్టేషన్ పథకంలో ఎంపిక
- ఆధునికీకరణ పనుల కోసం రూ.15.29 కోట్లు కేటాయింపు
- ఈ నెల 26న వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్న ప్రధానిమోదీ
మెదక్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద మెదక్ రైల్వేస్టేషన్ ఎంపికైంది. దేశంలోని 500 రైల్వేస్టేషన్ల ఆధునికీకరణలో భాగంగా మెదక్ రైల్వేస్టేషన్‌కు కూడా స్థానం దక్కడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకోసం కేంద్రం రూ. 15.29 కోట్లు కేటాయించింది. రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ, అధునాతన సౌకర్యాలు కల్పించేందుకు ప్రారంభించిన అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడం, స్టేషన్లో స్వచ్ఛత పాటించడం, ప్రయాణికుల వెయిటింగ్ హాల్స్, టాయిలెట్స్, ఉచిత వైఫై సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.
స్టేషన్ ముందు, వెనుక భాగాల్లో మొక్కల పెంపకం, చిన్నపాటి పార్కులు, స్టేషన్లో బిజినెస్ మీటింగ్స్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. అవసరమైన నిర్మాణాలు చేపట్టడం, పట్టణానికి ఇరువైపులా ఉన్న ప్రాంతాలను అనుసంధానం చేయడం, దివ్యాంగుల కోసం ప్రత్యేక వసతులు, సుస్థిర పర్యావరణ అనుకూల పరిష్కారాలు, పట్టాలకు ఇరువైపులా కాంక్రిట్ బాటలు, రూఫ్ ప్లాజాలు, ఇతర సౌకర్యాలను కల్పిస్తారు. ఈ నెల 26న ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా 40 స్టేషన్లను ఒకేసారి ఆన్లైన్ ద్వారా ప్రారంభించనున్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

