సిద్దిపేట, సెప్టెంబర్ 17( నమస్తే తెలంగాణ ప్రతినిధి): సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దకాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా కలెక్టర్ మనుచౌదరి, సీపీ అనురాధ, అడిషనల్ కలెక్టర్లు గరిమాఅగ్రవాల్, శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అం తకుముందు పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు.
అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ..సిద్దిపేట జిల్లాలో గత డిసెంబర్లో 8 రోజులు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టి జిల్లా వ్యాప్తంగా 3 లక్షల 25 వేల 214 దరఖాస్తులు స్వీకరించామన్నారు. ప్రజాపాలన సేవా కేంద్రాలు ప్రతి మండలం, మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసి ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తుల్లో మార్పులు, చేర్పులు, కొత్త దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించామని చెప్పారు. మహాలక్ష్మి పథకం ద్వారా 88 కోట్ల మంది మహిళలు ఉచిత రవాణా సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారని చెప్పారు. తద్వారా మహిళలకు రూ. 2,991 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. సిద్దిపేట జిల్లాలో ఇప్పటివరకు 2 కోట్ల 72 లక్షల మంది మహిళలు ఉచిత రవాణా సౌకర్యాలు ఉపయోగించుకున్నారని, దీంతో వారికి రూ.100 కోట్ల 39 లక్షల లబ్ధి చేకూరిందని వివరించారు.
రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పగడ్బందీగా అమలు చేయడంతోపాటు ఈ పథకం కింద పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్న లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని రూ.5 లక్షల నుం చి 10 లక్షలకు పెంచి అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ పథకం వల్ల జిల్లాలో 17 వేల 261 మంది పేదలు చికిత్స పొం దగలిగారన్నారు. ఇందుకు ప్రభుత్వం రూ.38 కోట్ల 44 లక్షల ఖర్చు చేస్తుందని చెప్పారు.
సిద్దిపేట జిల్లాలో మూడు విడతల్లో రుణమాఫీకి అర్హులైన లక్షా 2 వేల 75 మంది రైతులకు రూ.8 39 కోట్లు జమ చేశామని మంత్రి పొన్నం తెలిపారు. మహిళలందరినీ ఐదేండ్లలో కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంగా స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేస్తూ జీవనోపాధి పెం పొందించే ఉద్దేశంతో ప్రభుత్వం మహిళాశక్తి పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకంలో భాగం గా మైక్రో ఎంటర్ప్రైజెస్, డైయిరీ, స్టిచ్చింగ్, పౌల్ట్రీ మదర్ యూనిట్స్, బ్యాక్ యాడ్ పౌల్ట్రీ యూనిట్స్, ఫిష్ రిటైల్ అవుట్లెట్ యూనిట్స్, మిల్ పార్లర్ యూనిట్స్, మీసేవ సెంటర్స్,
ఈవెంట్ మేనేజ్మెంట్ యూనిట్స్, మహిళా శక్తి క్యాంటీన్, సోలార్ యూనిట్స్, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్స్, కష్టం హైరింగ్ సెంటర్, ఫుడ్ ప్రాసెసింగ్ యూని ట్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. జిల్లాలో 2024-25 సంవత్సరానికి 18 వేల 788 మంది స్వయం సహాయక సం ఘాల సభ్యులకు రూ.165 కోట్లతో జీవనోపాధి కల్పించడానికి ప్రణాళికలు రూపొందించుకొని అమలు చేస్తున్నామని చెప్పారు. జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, శాంతిభద్రతల నిర్వహణకు అహర్నిశలు కృషిచేస్తున్న పోలీసు యంత్రాంగానికి, వైద్యులకు, పారిశుధ్య కార్మికులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడి యా ప్రతినిధులకు మంత్రి పొన్నం ప్రభాకర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ప్రతిఒకరికీ సొంతింటి కలను నిజం చేయాలని ప్రభుత్వం భావిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రభుత్వం అమలు పరుస్తుందన్నారు. ఈ పథకం కింద ఈ సంవత్సరంలోనే 4 లక్షల 50 వేల గృహాలు నిర్మించతలపెట్టామన్నారు. ప్రతి నియోజకవర్గంలో 3,500 గృహాలు నిర్మిస్తామని చెప్పారు. మహాలక్ష్మి పథకం కింద కేవ లం రూ.500లకే వంట గ్యాస్ సరఫరా చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఈ పథకం కింద జిల్లాలో లక్ష 67 వేల 872 మందికి లబ్ధి చేకూరుతుందని చెప్పారు. ఇప్పటివరకు లక్ష 65 వేల 912 మంది వినియోగదారులకు 3 లక్షల 23 వేల 12 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేశామన్నారు. దీనికి ప్రభుత్వం రూ.9 కోట్ల 24 లక్షల సబ్సిడీ అందించిందన్నారు. గృహజ్యోతి కింద 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగదారులకు ప్రభు త్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తుంది. జిల్లాలో ఇప్పటివరకు లక్ష 89 వేల 806 కుటుంబాలకు లబ్ధి చేకూరింది.