రామాయంపేట : పోస్టల్ ఇన్సూరెన్సు ( Postal insurance ) చేసుకుంటే వాటివల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయని రామాయంపేట తపాలా శాఖ సూపరింటెండెంట్ నాగేశ్వర్రావు ( Superintendent Nageshwar Rao) అన్నారు.
సోమవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పోస్టల్లో ప్రమాద బీమాలను చేసుకోవచ్చ న్నారు. నువాభూపాలో రూ.755, స్టార్ హెల్త్‌లో రూ.799 కడితే సంవత్సరం పాటు ప్రమాద బీమా వర్తిస్తుందన్నారు. సంవత్సరంలో ఎప్పుడు ప్రమాదంలో మృతి చెందినా వారి కుటుంబానికి పోస్టల్ శాఖ ప్రమాద బీమా కింద రూ. 15లక్షలు అందిస్తుందన్నారు.
స్టార్ హెల్త్ బీమాలో డిగ్రీ చదివిన విద్యార్ధులు నెలనెలా పోస్టల్ బీమాను కడితే సాధారణ మరణానికి కూడా ప్రమాద బీమా రూ.15లక్షలతో పాటు , అదనంగా సంబంధిత శాఖ అందజేస్తుందన్నారు. ఇవే గాకుండా విద్యార్థులు పోస్టల్ కార్యాలయంలో రూ. 250తో ఖాతాలు తెరుచుకోవచ్చన్నారు. వారికి స్కాలర్‌షిప్‌ల కోసం పోస్టల్ శాఖ ఎంతగానో పనిచేస్తుందన్నారు. ఇతరులు ఎవరైనా పోస్టల్లో ఖాతాలు తీస్తే వారికి ఫోన్‌పే, గూగుల్ పే కూడా పనిచేస్తాయన్నారు.