సిద్దిపేట రూరల్/నంగునూరు, ఏప్రిల్ 18 : రైతులకు ఇచ్చిన హమీలను రేవంత్‌రెడ్డి వెంటనే అమలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన హమీలు అమలుకు నోచుకోకపోవడంతో తెలంగాణ ఉద్యమగడ్డ సిద్దిపేట రైతులు పోస్టు కార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా సిద్దిపేట రూరల్ మండలంలోని తోర్నాల, బుస్సాపూర్ గ్రామల రైతులు గురువారం రేవంత్‌రెడ్డికి పోస్టుకార్డులను రాసి పంపారు. ఓటుతో తగిన బుద్ధి చెబుతామని తోర్నాల, బుస్సాపూర్ గ్రామాల్లో రైతు లు నిరసన తెలిపారు. నంగునూరు మం డల పరిధిలోని రాంపూర్‌లో రైతులు పోస్టు కార్డు ఉద్యమం చేపట్టారు.
ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి పోస్టు కార్డుల ద్వారా ఉత్తరాలు రాశారు. రైతులకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్, రూ.2 లక్షల రుణమాఫీ, ఎకరానికి రూ.15 వేల రైతుబంధు అమలు చేయాలని పోస్టు కార్డుల ద్వారా తెలియజేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని పక్షంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధ్ది చెబుతామన్నారు. రైతులకు బీఆర్ఎస్ పక్షాన పూర్తి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అనగోని లింగంగౌడ్, మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి, నాయకుడు పరుశరాములు గౌడ్, గ్రామస్తులు పాల్గొన్నారు.