మద్దూరు(ధూళిమిట్ట), సెప్టెంబర్17: నిజాం, రజాకార్లకు ఎదురొడ్డి ప్రాణాలొదిలిన అమరవీరుల ఆశయాలు కొనసాగించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని బైరాన్‌పల్లిలో బుధవారం అమరవీరుల సంస్మరణ కార్యక్రమానికి ఆయన హాజరై గ్రామంలోని బురుజు వద్ద అమరవీరుల చిత్రపటాలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం నిరంకుశపాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో బైరాన్‌పల్లి పోరాటం ఎంతో గొప్పదన్నారు.సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి గ్రామంలో స్మారక కేం ద్రం ఏర్పాటు చేయాలని కోరడంతో పాటు గ్రామానికి తీసుకువస్తానని హామీ ఇచ్చారు.
రజకార్లకు వ్యతిరేకంగా పోరాడి అమరులైన బైరాన్‌పల్లిని అధికారికంగా వీరబైరాన్‌పల్లిగా పిలుచుకునేందుకు ప్రభుత్వం గెజిట్ విడుదల చేసేందుకు కృషి చేస్తానని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బైరాన్‌పల్లి బురుజు, స్తూపం మరమ్మతుల కోసం తన ఎంపీ నిధుల నుంచి రూ. 10లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యేలు ప్రతాప్‌రెడ్డి, రాజలింగం, చేర్యాల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ శ్వేత, వైస్ చైర్మన్ జీవన్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ గిరి కొండల్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు కిరణ్‌కుమార్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, నియోజకవర్గ యూత్ నాయకులు చెట్కూరి కమలాకర్, మారెళ్ల భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.