సిద్దిపేట, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలు రోజు రోజుకూ కుచించుకుపోతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చెరువులు, కుంటలతోపాటు ఇతర ప్రభుత్వ భూములు ఎక్కడ ఖాళీ కనిపిస్తే చాలు ఇట్టే కబ్జాలు చేసేస్తున్నారు. నీటి ప్రవాహానికి అడ్డుగా అక్రమ నిర్మాణాలు చేయడంతో చెరువుల పరిధి పూర్తిగా తగ్గిపోయింది. ఫలితంగా చిన్నపాటి వర్షాలకు నీరం తా ఇండ్లను ముంచెత్తుతున్నాయి. ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ పరిధిలోకి ఆక్రమణదారులు చొచ్చుకొచ్చి మరీ కబ్జాలు చేస్తున్నారు. దీనిని అరికట్టాల్సిన అధికారులే పూర్తిగా వారికి సహాయ సహకారలు అందిస్తున్నారనే విమర్శలు బలంగా ఉన్నాయి.
చెరువుల పర్యవేక్షణలో ప్రధానంగా మూడు శాఖల ప్రమే యం ఉంటుంది. రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ శాఖలు కలిసి పనిచేస్తేనే చెరువుల ఆక్రమణలను అరికట్టవచ్చు. వీటిలో ఏ ఒక్క శాఖ సహకరించకపోయినా చెరువుల ఆక్రమణలు మరింతగా పెరిగే అవకాశాలు మెం డుగా ఉంటాయి. కానీ ఉమ్మడి మెదక్ జిల్లా లో ఇటీవల రెవెన్యూ,నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో అధికారుల అండదండలతో రియల్టర్లు చెరువుల్లోనే వెంచర్లు ఏర్పాటు చేశారు. అక్రమార్జనే ధ్యేయంగా రియల్టర్లు వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.
దీంతో జిల్లాలోని పలు మండల కేంద్రాలతోపాటు, మున్సిపాలిటీల్లోనూ మేజ ర్ గ్రామాల్లో చెరువులు, విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. స్థానిక అధికారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొంతమంది బడా నేతలు కలిసి బఫర్ జోన్లోనే అక్రమ నిర్మాణాలు చేపట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ చేపట్టా రు. ఆ సమయంలో అన్ని చెరువులకు బఫర్ జోన్, ఎఫ్టీఎల్లను నిర్థారించింది. ప్రస్తు తం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆ హద్దులను యథేచ్ఛగా మార్చేసి, ఇష్టారీతిగా ఆక్రమిస్తున్నారనే విమర్శలు బలంగా ఉన్నాయి.
సిద్దిపేట, మెదక్ , సంగారెడ్డి జిల్లాల్లోని పలు చెరువులు స్వరూపాన్ని కోల్పోతున్నాయి. రికార్డులకు అక్కడ ఉన్న పరిస్థితులకు పొం తన లేకుండా ఉన్నది. రానురాను కుంటలను పూర్తిగా మాయం చేస్తున్నారు. ఇష్టారీతిగా కబ్జాలు చేయడంతో చెరువులు, కుంటలు ఆనవాలు లేకుండా పోతున్నాయి. సిద్దిపేట జిల్లా హెచ్ఎండీఏ పరిధిలో జిల్లాలో 277 చెరువుల ఎఫ్టీఎల్ను గుర్తించాలని ఇదివరకే ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం అధికారులు అదే పనిలో ఉన్నారు.
జిల్లాలో ప్రధానంగా కొన్నింటిని చూస్తే సిద్దిపేట కోమటి చెరువు ఎఫ్టీఎల్ , బఫర్‌జోన్ పరిధిలోనే అక్రమ కట్టడాలు వెలిశాయి. హద్దులను ఏకంగా తొలిగించారు. ఏకంగా అధికార కాం గ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఎఫ్టీఎల్, బఫర్ జోన్లోనే నిర్మించారు. మరికొన్ని ఫాంహౌస్‌ల నిర్మాణాలతోపాటు అనేక కట్టడాలు వెలిశాయి. పట్టణంలోని కొన్ని కుంటలను యథేచ్ఛగా కబ్జాలు చేసి ప్లాట్లు చేసి విక్రయించారన్న ఫిర్యాదులు ఉన్నాయి. సిద్దిపేట పట్టణం చుట్టూ పదుల సంఖ్యలో చెరువులు, కుంట లు ఉండేవి. అవి రానురాను పూర్తిగా కుచించుకుపోయాయి. దీనిని అరికట్టాల్సిన రెవె న్యూ, మున్సిపల్, ఇరిగేషన్ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. ఇదేంటి అని అడిగితే తాము ఇటీవలే బదిలీపై వచ్చాం.
తమకు ఏం తెలియదు అన్నట్లుగా అధికారులు వ్యవహరించడం కోసమెరుపు. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు లొంగి అధికారులు ఇలా మాట్లాడుతున్నాకరనే విమర్శలు బలంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలోని చేర్యాల ప్రాం తంలో పలు చెరువులు పూర్తిగా కబ్జాకు గురయ్యాయి. చేర్యాల ప్రాంతంలోని కుడి చెరు వు పూర్తిగా ఆక్రమణదారుల చేతిలోకి వెళ్లిం ది. చేర్యాల మండలం నాగపూరి-జగదేవ్‌పూర్ మండలం తిగుల్ నర్సాపూర్ గ్రామా ల సరిహద్దులో ఉన్న నల్లపోచమ్మ చెరువులో అక్రమ కట్టడాలు వెలిశాయి. ఈ తంతు కొనేండ్లుగా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రాంతంలో పాండవుల చెరువు ఫీడర్ ఛానల్ పూర్తిగా కుచించుకుపోయింది. ఇలా పట్టణంలోని పలు చెరువులు, కుంటల పరిస్థితి ఇం తే. దుబ్బాక, హుస్నాబాద్ ప్రాంతాల్లో చెరువులు కుంటల పరిస్థితి ఇలానే ఉంది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలోనే పెద్దపెద్ద నిర్మాణాలు జరిగాయి. మెదక్ జిల్లాలోని పలు చెరువులు కుంటలు పూర్తిగా కబ్జాకు గురయ్యాయి. మెదక్ పట్టణంలోని మల్లెంల చెరువు పూర్తిగా అక్రమణదారుల చేతుల్లోకి పోయింది. ఇష్టారీతిగా అక్రమ నిర్మాణాలు చేపట్టారు. నర్సాపూర్‌లోని రాయరావు చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. రాయాయంపేట, తుప్రాన్, చేగుంట తదితర ప్రాం తాల్లో చాలావరకు కుంటలు కనుమరుగయ్యాయి.