సిద్దిపేట, అక్టోబర్ 21: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివని సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎస్.ఎం. విజయ్‌కుమార్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం సిద్దిపేట సీపీ కార్యాలయ ప్రాంగణంలోని పోలీస్ అమర వీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఆర్ఎస్సై సాయిప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్మృతి పెరేడ్లో గౌరవ వందనం స్వీకరించారు. సిద్దిపేట జిల్లాలో గతంలో విధి నిర్వహణలో అమరులైన కుటుంబసభ్యులను కలుసుకొని వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భం గా అమరుడైన ప్రకాశ్‌సింగ్ భార్య కౌసల్య తన భర్తను గుర్తుచేసుకొని కన్నీరు పెట్టగా బాధపడవద్దని అండగా ఉంటామని పోలీస్ కమిషనర్ ఓదార్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసుల అమరుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నా రు. ఆరోగ్యాన్ని సైతం లెకచేయకుండా పోలీసులు విధులు నిర్వహిస్తున్నార న్నారు. ప్రజల రక్షణ గురించి నిరంతరం కృషి చేస్తున్న పోలీసులను ప్రతి ఒకరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భారతదేశ రక్షణ, ప్రజాస్వామ్య విలువలు కాపాడటంలో ఎనలేని కృషి చేసున్న పోలీసులకు అభినందనలు తెలిపారు. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా త్యాగాలను సమాజం గుర్తుంచుకొనే విధంగా ఈ నెల 31 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
మహిళల రక్షణ కోసం షీటీమ్, భరోసా, సఖీ సెంటర్ల ద్వారా మహిళలకు, చిన్నారులకు ఎన్నోరకాల సేవలు పోలీస్‌శాఖ ద్వారా నిర్వహిస్తున్నామన్నారు. అడిషనల్ డీసీపీలు అడ్మిన్ సీహెచ్ కుషాలర్, ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, ఏసీపీలు నరసింహు లు, రవీందర్‌రెడ్డి, సుమన్‌కుమార్, ఎస్బీ ఇన్స్పెక్టర్లు కిరణ్, మొగిలి, శ్రీధర్‌గౌడ్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు విష్ణుప్రసాద్, ధరణి కుమార్, రాజేశ్, కార్తీక్, ఇన్స్పెక్టర్లు, సీఐలు వాసుదేవరావు, ఉపేందర్, ప్రవీణ్‌కుమార్, శ్రీను, శ్రీనివాస్, లతీఫ్, రామకృష్ణ, మల్లేశం గౌడ్, జిల్లా రిటైర్డు పోలీస్ అధికారులు, రాజు, వీరారెడ్డి, పోలీస్ అధికారులు, సీపీ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.