అమీన్పూర్, మార్చి 7: లేడీస్ హాస్టల్లో గోప్యంగా స్పై కెమెరా బిగించి వీడియోలు చిత్రీకరిస్తున్న సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. అమీన్పూర్ ఇన్స్పెక్టర్ నరేశ్ వివరాల ప్రకారం.. బండారు మహేశ్ అనే వ్యక్తి అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కిష్టారెడ్డిపేట్ మైత్రి విల్లాస్లోని విల్లా నెంబర్ 75లో సుమారు 35 మంది విద్యార్థినులతో లేడీస్ హాస్టల్‌ను నిర్వహిస్తున్నాడు. కొంతకాలంగా హాస్టల్లో గోప్యంగా స్పై కెమెరాను బిగించి ఫొటోలు చిత్రీకరిస్తున్నట్లు విద్యార్థినులు గమనించారు.
ఈ విషయాన్ని అమీన్పూర్ పోలీసులకు సమాచారం అందించారు. విద్యార్థినుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి హాస్టల్‌ను సందర్శించి కెమెరాలోని పలు చిప్స్‌లను పరిశీలించారు. కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ నరేశ్ తెలిపారు. ఈ ఘటనపై విద్యార్థినుల తల్లిదండ్రులు, స్థానికులు లేడీస్ హాస్టల్లో ఎదుట ఆందోళనకు దిగారు. ఇలాంటి వారిపై కఠినంగా వ్యవహరించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.