సిద్దిపేట టౌన్,మే 11 : యువత దేశ భవిత..గంజాయి, మత్త పదార్థాలకు దూరంగా ఉంటూ.. తమనుతాము మలచుకొని ఉత్తమ పౌరులుగా ఎదగాలని సిద్దిపేట వన్‌టౌన్, టూటౌన్ సీఐలు వాసుదేవరావు, ఉపేందర్‌లు సూచించారు. గంజాయి నిర్మూలనలో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రం సిద్దిపేటలో నార్కటిక్స్ డాగ్స్‌తో అనుమానస్పద ప్రాంతలలో తనిఖీలను చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గంజాయి మత్తు పదార్థాలు కలిగి ఉన్నా ..రవాణా చేసినా, అమ్మినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గంజాయి, మత్తు పదార్థాల బారిన పడకుండా తల్లి దండ్రులు పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలన్నారు. మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. లక్ష్యాన్ని ఏర్పరుచుకొని అందుకు అనుగుణంగా శ్రమించాలన్నారు. కార్యక్రమంలో ఎస్లైలు కొమురయ్య, రాజేశం, పోలీస్, డాగ్ స్కాడ్స్ సిబ్బంది ఉన్నారు.