హవేళీఘనపూర్, జూలై 16 : వర్షాకాలంలో పచ్చదనాన్ని పంచే పోచారం డ్యామ్ ఈ ఏడాదితో వందేండ్లు పూర్తి చేసుకుంది. నిజాం రాజులు ఈ ప్రాంతంలో విడిది కోసం ఎత్తైన గుట్టపై నిర్మించిన పురాతన కట్టడాలు వందేండ్లు పూర్తయినా నేటికి చెక్కుచెదర్లేదు. మెదక్ పట్టణానికి 15 కిలోమీటర్ల దూ రంలో ఉన్న ఈ డ్యామ్‌తో పాటు పక్కనే పోచారం అభయారణ్యం ఉంది. దీంతో ఈ ప్రాంతానికి రోజు రోజుకూ పర్యాటకుల సంఖ్య పెరుగుతూనే ఉంది. నిజాం రాజులు ఈ ప్రాంతంలో జంతువులను వేటాడేవారని పూర్వికులు చెబుతుంటారు. ప్రాజెక్టు నిర్మాణం 1917లో ప్రారంభమై 1922 వరకు నిర్మాణం కొనసాగింది. ప్రాజెక్టు 2.423 టీఎంసీల నీటి సామర్థ్యంతో దీనిని నిర్మించారు. ఈ ప్రాజెక్టు ప్రస్తుతం 1.82 టీఎంసీలకు తగ్గింది. ప్రాజెక్టు కాలువ ద్వారా నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాలకు దాదాపు 10,500 ఎకరాలకు సాగునీటిని సరఫరా చేస్తున్నారు. ముఖ్యం గా ఈ ప్రాజెక్టుకు కామారెడ్డి జిల్లా నుంచి గంగమ్మవాగుతో పాటు ఇతర వాగుల నుంచి నీరు వస్తుండటంతో ప్రాజెక్టు నిండి పొంగి ప్రవహిస్తున్నది. పోచారం డ్యామ్ అందాలను చూ సేందుకు వివిధ ప్రాంతాల ను నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు.
చెక్కుచెదరని పురాతన కట్టడాలు
పోచారం ప్రాజెక్టు పక్కనే నిజాం రాజులు సేదతిరేందుకు వీలుగా రెండంతస్తుల భవనాన్ని నిర్మించుకున్నారు. మరో పక్క ఎత్తైన గుట్టపై నిర్మించిన మరో విశ్రాంతి గృహం కూడా నేటికి చెక్కుచెదరలేదు. ఈ ప్రాం తాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభు త్వం నిధులు మంజూరు చేసి గుట్టపైకి రోడ్డు నిర్మాణం చేపట్టారు. గతం లో మెదక్ కలెక్టర్ భారతిహోళికేరి ప్రత్యే క చొరవతో పర్యాటకులకు ఆహ్లాదం పం చే విధంగా డ్యామ్‌లో బోటును కూడా ఏర్పాటు చేశా రు. ప్రాజెక్టు మధ్యలో ఉన్న సరస్సు మధ్యకు తీసుకెళ్లి ప్రాజె క్టు అందాలను పర్యాటకులకు చూపించేవారు.
ఆనందం పంచే పోచారం అభయారణ్యం
పోచారం డ్యామ్‌కు వెళ్లే దారిలో ముందుగా వచ్చే పోచా రం అభయారణ్యం కూడా పర్యాటకులకు ఎంతో ఆహ్లాదం పంచుతోంది. ఈ అభయారణ్యంలోకి వెళ్లి అందులో ఉన్న జింకలను, దుప్పులు, నెమళ్లు, అడవి పందులు ఇతర జంతువులను చూసేందుకు వీలుగా ప్రత్యేకంగా ఓ సఫారీ వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఈ వాహనంలో 8మంది వెళ్లేందుకు వీలుంటుంది. ఒక్కొక్కరికీ రూ. 80 చెల్లిస్తే అభయారణ్యంలో దాదాపు 12కిలోమీటర్ల మేర తీసుకెళ్తారు. అభయారణ్యం అందాలను చూసేందుకు ప్రజలు కూడా ఎంతో ఇష్టపడుతారు. ఈ ప్రాంతంలోకి గతంలో అటవీశాఖ మంత్రి జోగు రామన్నతో పాటు ఎందరో ప్రముఖులు ఈ ప్రాంతాన్ని పర్యటించి అభివృద్ధి చేసేందుకు కృషి చేశారు.