PLFS Survey | రాయపోల్, నవంబర్ 17: ప్రజల ఉపాధి, జీవన స్థితిగతులను అధ్యయనం చేయడానికి కేంద్ర గణాంక శాఖ నిర్వహిస్తున్న పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS)ను సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలంలో ప్రారంభించారు. సోమవారం చిన్న మాసాన్‌పల్లి గ్రామంలో సర్వే ప్రారంభించినట్లు గణాంక శాఖ అధికారి గుర్రం శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎంపిక చేసిన పట్టణాలు, గ్రామాల్లో సర్వే కొనసాగుతుందని పేర్కొన్నారు. మొదట సాధారణ కుటుంబ వివరాలను నమోదు చేసి, ప్రత్యేక ట్యాబ్ ద్వారా ఎంపిక చేసిన కుటుంబాలపై మూడు నెలలకు ఒకసారి పూర్తి స్థాయి సర్వే నిర్వహిస్తామని చెప్పారు. ఇందులో కుటుంబ యజమాని పేరు, సభ్యుల వివరాలు, విద్యార్హతలు, వృత్తి, కోర్సులు, స్వయం ఉపాధి తదితర అంశాలు నమోదు చేస్తామని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో రాయపోల్ ఎంపీడీవో జమ్లా నాయక్, ఎంపీఓ శ్రీనివాస్, గ్రామపంచాయతీ కార్యదర్శి లావణ్య, ఫీల్డ్ అసిస్టెంట్ యాదగిరి, అంగన్వాడీ టీచర్ స్వప్న, ఆశా వర్కర్ లక్ష్మి, శంకర్, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Sarangapur | పంటల అవశేషాలను కాల్చడంతో సేంద్రీయ పోషకాలు నశిస్తాయి.. సారంగాపూర్ ఏవో ప్రదీప్ రెడ్డి
Farmers Protest | పత్తిని కొనుగోలు చేయాలని కలెక్టరేట్ ఎదుట ఆందోళన
NBK 111 | బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబో రిపీట్.. ఈ నెలాఖరున కొత్త సినిమా ప్రారంభం!