దుబ్బాక టౌన్, మే 20: దేశ ప్రజానీకంపై ఆర్థిక భారం మోపుతున్న బీజేపీ ప్రభు త్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు భాస్కర్ అన్నారు. వంట గ్యాస్ ధర పెంపునకు నిరసనగా సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం దుబ్బాకలోని బస్స్టాండ్ వద్ద బీజేపీ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్ సామాన్యుల కు పెను భారంగా మారిందన్నారు.
ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు ఇబ్బందులు పడుతుండగా, నెలలో రెండుసార్లు గ్యాస్ ధరలు పెంచి గోరు చుట్టు రోకలిపోటులా మోదీ ప్రభుత్వం తయారైందన్నారు. గ్యాస్ సిలిండర్ ధర గురువారం మరోసారి పెంచడం దుర్మార్గమన్నారు. కమర్షియల్ సిలిండర్ ధరల పెంపునకు అడ్డూఅదుపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తేవాలని పలుమార్లు డిమాండ్ చేసినా కేంద్రం సిద్ధపడడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రజాభిప్రాయానికి అనుగుణం గా పెంచిన ధరలను వెంటనే తగ్గించి పెట్రో ల్, డిజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తేవాల ని, పెంచిన వంట గ్యాస్ ధరను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాదిక్, స్వామి, కొంపెల్లి భాస్క ర్, యాకుబ్, అరవింద్, నర్సింలు, సంతో ష్, రాములు పాల్గొన్నారు.