రామాయంపేట, మే 14: మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో నిధుల దుర్వినియోగంపై సీఎం రేవంత్రెడ్డి ఉన్నత స్థాయి కమిటీ వేసి సమగ్ర విచారణ చేపట్టాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్ల్లోళ్ల శశధర్రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం రామాయంపేట విలేకరులతో ఫోన్లో ఆయన మాట్లాడారు. కొన్ని రోజులుగా రామాయంపేట మున్సిపల్ నిధుల గోల్మాల్పై అనేక ఆరోపణలు వస్తున్నాయని, ప్రభుత్వం విచారణ చేయించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
ఈ విషయమై సీఎంకు నేరుగా లేఖ అందజేస్తానని తెలిపారు. మున్సిపల్ శాఖలో పనులు చేసే అధికారులే ఈ రకంగా ప్రజా ధనాన్ని దోపిడీ చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు.బాధ్యులు ఎంతటి వారైనా ఉపేక్షించి వద్దన్నారు. మూడు నెలల్లోనే రూ.30లక్షల నిధులు ఎలాంటి బిల్లు లు, రసీదులు లేకుండా ఖర్చు చేయడం మంచి పద్ధతి కాదని శశిధర్రెడ్డి అన్నారు.