రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
రోగులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా దవాఖానల సేవల సమన్వయకర్త డాక్టర్ కవిత సూచించారు. ఈ నెల 15వ తేదీన ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురితమైన ’ప్రభుత్వ వైద్యం.. అందని దైనం..అనే కథనానికి సంబంధిత జిల్లా అధికారులు స్పందించారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు బుధవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఏరి యా దవాఖానను జిల్లా దవాఖానల సేవల సమన్వయ కర్త డాక్టర్ కవిత సందర్శించారు.
- విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
- జిల్లా దవాఖానల సేవల సమన్వయకర్త డాక్టర్ కవిత
- దవాఖానలో వైద్యాధికారుల పనితీరుపై ఆగ్రహం
- జహీరాబాద్ ఏరియా దవాఖాన విజిట్
జహీరాబాద్, జూన్ 17 : రోగులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా దవాఖానల సేవల సమన్వయకర్త డాక్టర్ కవిత సూచించారు. ఈ నెల 15వ తేదీన ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురితమైన ’ప్రభుత్వ వైద్యం.. అందని దైనం..అనే కథనానికి సంబంధిత జిల్లా అధికారులు స్పందించారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు బుధవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఏరి యా దవాఖానను జిల్లా దవాఖానల సేవల సమన్వయ కర్త డాక్టర్ కవిత సందర్శించారు. స్థానిక దవాఖాన సూపరిండెంటెంట్ కిరణ్కుమార్, వైద్యాధికారులతో సమావేశమయ్యారు.
రోగులకు వైద్య సేవలు అందించడంలో వైద్యాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణులు కాన్పులు చేయించుకునేందుకు దవాఖానకు వస్తే సంబంధిత వైద్యాధికారులు ఎలాంటి అనుమతి లేకుండా విధులకు గైర్హాజరుకావడం ఏమిటని ప్రశ్నించారు. కాన్పులు చేయకుండా ఇతర దవాఖానలకు వెళ్లాలని సూచించడం సరికాదన్నారు. రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఆనంతరం దవాఖానలో పలురికార్డులు పరిశీలించడంతో పాటు వార్డుల్లో పర్యటించి వైద్య సేవల గురించి రోగులను ఆమె అడిగి తెలుసుకున్నారు.
వైద్యాధికారుల పోస్టులను భర్తీ చేయాలి
జహీరాబాద్ ఏరియా దవాఖానలో ఖాళీగా ఉన్న వైద్యాధికారుల పోస్టులను వెంటనే భర్తీచేసేలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని జిల్లా దవాఖానల సేవల సమన్వయ కర్త డాక్టర్ కవితను జహీరాబాద్ పట్టణ కౌన్సిలర్లు నామ స్రవంతి, మజ్జిగ సుజిత, నాయకులు నామరవికిరణ్, విశ్వేశ్వర్ కోరారు. ఈ సందర్భంగా ఆమెను కలిసి స్థానిక దవాఖానలో నెలకొన్న సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
- Tags
- Patients
- treatment
- Zaheerabad
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

