కోహీర్, ఆగస్టు 24: రోగులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. శనివారం సంగారెడ్డి జిల్లా కోహీర్ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో రోగులకు వైద్య సేవలు కరువయ్యాయి. కొంతమంది రోగులు ఎక్స్రే తీయించుకునేందుకు దవాఖానకు వస్తే వారికి నిరాశే ఎదురైంది. ఎక్స్రే గదికి తాళం వేసి ఉండడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓపీ చూసేందుకు ఒక ట్రైనీ డాక్టర్ మాత్ర మే అందుబాటులో ఉన్నారు.
మిగతా వారంతా డుమ్మా కొట్టారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. రోగులకు ఉత్తమ సేవలందించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభు త్వం రూ.11.50కోట్లతో దవాఖానను నిర్మించింది. కానీ సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వల్ల రోగులకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదు. సరిపడా వైద్యులు, సిబ్బందిని నియమించకపోవడంతో మందులు కూడా ఆయుర్వేదిక్ సిబ్బంది ఇవ్వడం విశే షం. సూపరింటెండెంట్ డాక్టర్ రజనిని వివరణ కోరేందుకు య త్నించగా ఆమె అందుబాటులోకి రాలేదు.