Panchayat Labourers | నిజాంపేట, జూన్27 : మూడు నెలలుగా జీతాలు రాకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేయడానికి హైదరాబాద్‌లోని సచివాలయం ముట్టడికి వెళ్తున్న నిజాంపేట పంచాయతీ కార్మికులను స్థానిక పోలీసులు శుక్రవారం ముందస్తు అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా పంచాయతీ కార్మికులు మాట్లాడుతూ.. కార్మికులను రెగ్యులరైజ్ చేస్తానని ఇచ్చిన హామీని ఎట్లా మర్చిపోయావని సీఎం రేవంత్‌పై మండిపడ్డారు. మూడు నెలల నుంచి కార్మికులకు జీతాల్లేకుండా కడు పేదరికంలో బతుకుతున్నామని, కనీసం కుటుంబ అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ముందస్తు అరెస్ట్ అయిన వారిలో పంచాయతీ కార్మికులు రాజు, శ్రీరాములు, రవి, ఏసు ఉన్నారు.