సిర్గాపూర్, జూన్ 15: బీఆర్ఎస్ హయాంలో పల్లె ప్రగతి అభివృద్ధి కార్యక్రమంలో ప్రతి గ్రామ పంచాయతీకి కేటాయించిన ట్రాక్టర్లు మూలన చేరాయి. అధికారుల పర్యవేక్షణ లేక, జీపీకి నిధులు రాకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతున్నది. మండలంలోని పెద్ద ముబారక్‌పూర్‌లో స్థానిక పంచాయతీ కార్యాలయం ఎదుట పల్లె ప్రగతి ట్రాక్టర్, ట్రాలీ మూలకు చేరాయి.
కొన్ని రోజలు క్రితం ట్రాక్ట ర్ ఇంజిన్ చెడిపోయింది. దీనికి రిపేర్ చేయిం చే నాథుడే కరువయ్యారు. దీంతో గ్రామంలో పారిశుధ్య నిర్వహణ, చెత్త సేకరణ, చెట్లకు నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయాయి. గతంలో వీటి బాధ్యత సర్పంచ్‌లు చూసుకునేది. సర్పంచ్ల పదవీ కాలం ముగియగానే ప్రత్యేక అధికారుల పాలన రావడంతో నిధు లు లేక వాళ్లు చేతులెత్తేశారు. ట్రాక్టర్ పనిచేయకపోవడంతో గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ చెత్తాచెదారం పేరుకుపోయి, వీధులు కంపుకొడుతున్నాయి.
ఈ విషయమై మండ ల పంచాయతీ అధికారి బ్రహ్మయ్యను వివరణ కోరగా, ట్రాక్టర్ చెడిపోయిన విషయం వాస్తవమేనన్నారు. దీన్ని రిపేర్ చేయించేందుకు అవసరమయ్యో నిధుల కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పెట్టామని, నిధులు రాగానే రిపేర్ చేయిస్తామని ఆయన పేర్కొన్నారు.