కొమురవెల్లి, ఏప్రిల్ 20 : బీఆర్ఆర్ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో బీఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి ఆయన హాజరై మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించారన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు చేయించి అవసరమైన వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించారని గుర్తుచేశారు.
అదే స్ఫూర్తితో బీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బొంగు రాజేందర్రెడ్డి ఉచితంగా కంటి వైద్య పరీక్షలు చేయించడంతో పాటు అవసరమైన వారికి హైదరాబాద్లోని కంటి దవాఖానలో శస్త్రచికిత్సలు చేయించడం గొప్ప విషయమన్నారు. వైద్య శిబిరానికి హాజరైన వారికి ఎమ్మెల్యే పల్లా దగ్గరుండి స్వయంగా భోజనం వడ్డించారు.కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సిలువేరు సిద్ధప్ప, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తలారి కిషన్, ముత్యం నర్సింహులుగౌడ్, గొల్లపల్లి కిష్టయ్య, బుడిగె గురువయ్యగౌడ్, ఏర్పుల మహేశ్, మాజీ ఉపసర్పంచ్ కొండ శ్రీధర్, బొంగు తిరుపతిరెడ్డి, పచ్చిమడ్ల స్వామిగౌడ్, బూర్గు స్వామిగౌడ్, బొడిగం వంశీ, బుడిగె రమేశ్, పుట్ట కనకరాజు, వైద్యులు, సిబ్బంది, బీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బొంగు రాజేందర్రెడ్డి పాల్గొన్నారు.