మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 9: ఈనెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు ప్రతి ఒక్కరూ తరలివచ్చి విజయవంతం చేయాలని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం మెదక్‌లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జడ్పీ మాజీ ఉపాధ్యక్షురాలు లావణ్యరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, బీఆర్ఎస్ పట్టణ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు, ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ హనుమంత్‌రెడ్డి, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, జయరాజ్, బీఆర్ఎస్ నాయకులతో కలిసి బీఆర్ఎస్ రజతోత్సవ సభ వాల్ పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..జిల్లాలోని ప్రతి పల్లె నుంచి సభకు జనం, పార్టీ శ్రేణులు, అభిమానులు తరలివచ్చేలా నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలన్నారు. ఏప్రిల్ 27న ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించి, డప్పులతో ర్యాలీలు నిర్వహించి వరంగల్ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తరలి వెళ్లాలన్నారు. వారం రోజుల్లో గ్రామాలు, పట్టణాల్లో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని శ్రేణులకు ఆమె సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో విఫలమైందని, ఒక్క హామీ సరిగ్గా అమ లు కావడం లేదని పద్మాదేవేందర్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికలు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధ్దంగా ఉన్నారని ఆమె అన్నా రు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జుబేర్ అహ్మద్, కిష్టయ్య, యాదగిరి, సాయిలు, సుబ్బారావు, రాజు, రంజిత్ లడ్డూ నాయక్, శ్రీహరి, సతీష్‌రావు, రాంచంద్రరెడ్డి, లింగం, చెన్నగౌడ్, చాంద్‌పాషా తదితరులు పాల్గొన్నారు.