మెదక్ మున్సిపాలిటీ, జనవరి 12: ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా.. అని మెదక్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి ఆదివారం ప్రకటనలో మండిపడ్డారు. భువనగిరిలో బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకుల దాడిని ఆమె ఖండించారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా ప్రతిపక్ష పార్టీలపై దాడులు చేయడం సిగ్గుచేటు అన్నారు. బీఆర్ఎస్ కార్యాలయంపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని, రాబోయేది మళ్లీ బీఆర్ఎస్ సర్కారేనని, పదేండ్ల్లలో బీఆర్ఎస్ ఇలాంటి అరాచకాలు చేయలేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తప్పనిసరిగా అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.