మెదక్, ఏప్రిల్ 23(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం మెదక్ పట్టణంలోని గుల్షన్ క్లబ్ ఆవరణలో ధర్నా నిర్వహిస్తున్న ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపి ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి అమలు చేయడం లేదన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.
మెదక్ ఆర్టీసీ డిపో ముందు శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్న పోలీసులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి ఇబ్బందుల గురి చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మెదక్ లో ఆర్టీసీ కార్మికులను అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. మహిళలను చూడకుండా పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి వాహనాలను పాపన్నపేట పోలీస్ స్టేషన్ కు తరలించారని తెలిపారు. న్యాయమైన డిమాండ్ పరిష్కరించే వరకు ఉద్యమం కు మద్దతిస్తామని తెలిపారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఉద్యమం కోసం ఆర్టీసీ కార్మికులు ఎన్నో పోరాటాలు చేశారని రద్దు చేశారు. ఆర్టీసీ బంద్ చేయడంతోనే దేశ వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమానికి గుర్తింపు లభించుదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత ధోరణితో ఆర్టీసీ కార్మికులను అరెస్టు చేసి ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున గౌడ్, బీఆర్ఎస్ పట్టణ కన్వీనర్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.