మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 1: శాసనసభలో బీ ఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను కించపర్చే విధం గా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అహంకార ధోరణి వీడాలని, భేషరతుగా మహిళాలోకానికి క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి డిమాండ్ చేశారు. అమెరికాకు వెళ్లిన ఆమె గురువారం ఒక ప్రకటనలో సీఎం మాట్లాడిన తీరుపై స్పందించారు.
శాసనసభలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతావా, తెలంగాణ ఆడబిడ్డలంటే అంత చులకనా, ముఖ్యమంత్రి అని మితిమీరిన గర్వంతో మాట్లాడుతున్నావు, అధికారం శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలన్నారు. ఆడబిడ్డలను ఏడిపిస్తే ఆ ఉసురు ఊరికే పోదన్నారు. ఎమ్మెల్యేలు సబితాఇంద్రారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డికి భేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.