సిద్దిపేట, నవంబర్ 6: ఈ వానకాలం రైతులకు కలిసి రాలేదని చెప్పవచ్చు. భారీ కురిసిన వర్షాలకు అన్ని పంటలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. తీరా చేతికి వచ్చిన పంటను అమ్ముకుందామంటే అకాల వర్షాలు రైతులను ఆగంజేస్తున్నాయి. ఈసారి మక్క రైతులకు మద్దతు ధర లభించడం లేదు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో మక్కలు అమ్ముదాం అంటే ప్రభుత్వ నిబంధనలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మక్కలు అమ్ముకోవడానికి రోజుల తరబడి కొనుగోలు కేంద్రాలు, మారెట్ యార్డుల్లో రైతులు పడిగాపులు కాస్తున్నారు.
రెండు రోజుల క్రితం వరకు ఎకరాకు 18.50 క్వింటాళ్లు మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసింది. దీంతో మిగతా మక్కలను రైతులు బయట వ్యాపారులకు వారు చెప్పిన ధరకే విక్రయించి నష్టపోయారు. రైతు వచ్చి ఫింగర్ ప్రింట్ పెడితే తప్ప సర్కారు కొనుగోలు కేంద్రాల్లో మక్కలు కొనక పోవడంతో కౌలు రైతులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. టోకెన్లతో పాటు గోనె సంచులు పొందడానికి కౌలు రైతులు ఇబ్బందులను ఎదురొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఫింగర్ ప్రింట్ విధానాన్ని బంద్‌జేసి ఓటీపీ ద్వారా మక్కలు కొనాలని రైతులు కోరుతున్నారు. ఒకో కౌలు రైతు నెలరోజుల నుంచి మారెట్లోనే పడిగాపులు కాస్తున్నాడు. దీనికి తోడు ఇటీవల కురిసిన ముంథా తుపపానుతో మక్కలు తడిసి ఆరబెట్టడానికి రైతులకు చాలా సమయం పట్టింది. దీనికోసం మారెట్ యార్డులోనే ఉంటుతున్నారు.
రైతులకు అందని మద్దతు ధర మక్క
మక్క రైతులకు మద్ధతు ధర అందని ద్రాక్షలా మారింది. ఎకరాకు 25 నుంచి 30 కింటాళ్ల వరకు దిగుబడి వస్తే, ప్రభుత్వం ఎకరాకు 18.50 క్వింటాళ్లు మాత్రమే రైతుల నుంచి కొన్నది. దీంతో మిగతా మక్కలు వ్యాపారులకు తక్కువ ధరకు కొనడంతో రైతులకు నష్టం జరిగింది. వ్యాపారులు క్వింటాలుకు రూ. 1800 నుంచి 1900కు మాత్రమే కొంటున్నారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలుకు రూ.2400 ఉంది. దీంతో క్వింటాలుకు రూ. 500 వరకు రైతు నష్టపోతున్నారు.సిద్దిపేట వ్యవసాయ మారెట్ యార్డులోని కొనుగోలు కేంద్రంలో ఇప్పటిదాకా 108 మంది రైతుల వద్ద 3820 క్వింటాళ్ల మక్కలను కొన్నారు. సిద్దిపేట వ్యవసాయ మారెట్ పరిధిలో వ్యాపారులు సెప్టెంబర్ 01 నుంచి అక్టోబర్ 01 వరకు 1072 మంది రైతుల నుంచి 25,155 క్వింటాళ్ల మక్కలు కొనుగోలు చేయడం విశేషం. దీనిని బట్టి చూస్తే ప్రభుత్వం కంటే వ్యాపారులే ఎక్కువ మక్కలు కొన్నట్లు తెలుస్తుంది.
న్లైంది మక్కలు తెచ్చి..
మేము 12 ఎకరాలు కౌలుకు తీసుకుని మక్క సాగుచేశాం. సిద్దిపేట మార్కెట్ యార్డుకు మక్కలు తెచ్చి 33 రోజులు అవుతున్నది. ఇప్పటి వరకు మక్కలు కొనలేదు. పంట పండించిన దానికంటే అమ్ముకోవడం కష్టమవుతున్నది. స్వయంగా పట్టాదారు రైతులు వచ్చి వేలిముద్ర వేస్తేనే గోనె సంచులు, టోకెన్ ఇచ్చి కొనుగోలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఎకరాకు18.50 క్వింటాళ్లే కొంటామని నిన్నమొన్నటి వరకు అధికారులు చెప్పారు. వేలిముద్ర తీసివేసి ఓటీపీతో మొత్తం మక్కలను ప్రభుత్వం కొనాలి.
– రెడ్డి కావేరి, కౌలు రైతు, పెద్దకోడూరు (సిద్దిపేట జిల్లా)
వేలిముద్ర నిబంధన తీసేయాలి..
నేను 18 రోజుల క్రితం మూడు ట్రిప్పుల మక్కలు మారెట్ యార్డుకు తెచ్చాను. మూడెకరాల్లో మక్క పంటను సాగుచేసి. రైతు స్వయంగా వచ్చి వేలిముద్ర వేయాలని, లేదంటే కొనుగోలు చేయమని అధికారులు చెబుతున్నరు. మార్కెట్లోనే పడిగాపులు కాస్తున్నాం. వేలిముద్రలు లేకుండా ఓటీపీ సహాయంతో కొనాలి. కొనుగోళ్లు ఆలస్యం జరుగుతుండడంతో మాకు తిప్పలు అవుతున్నది.
– జాజుల చందు, రైతు, రాజగోపాల్‌పేట (సిద్దిపేట జిల్లా)