దుబ్బాక, డిసెంబర్ 7: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో శనివారం సాయంత్రం కురిసిన వర్షానికి మార్కెట్ యార్డులో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం అలసత్వం కారణంగా అకాల వర్షంతో ధాన్యం తడిసి రైతులు నష్టపోతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను మార్కెట్‌యార్డుకు విక్రయాని తెచ్చిన అన్నదాతలకు కన్నీళ్లే దిక్కయ్యాయి.
దుబ్బాక మార్కెట్‌యార్డులో శనివారం కురిసిన వర్షానికి చాలామంది రైతుల ధాన్యం తడిసిపోయింది. రైతులు ధాన్యంపై టార్పాలిన్ కవర్లు కప్పినా ఫలితం లేకుండా పోయింది. వర్షం నీరు ధాన్యం కుప్పల కిందకు చేరడంతో తడిసిపోయాయి. మరికొందరు రైతులు టార్పాలిన్ కవర్లు లేకపోవడంతో చేసేదేమిలేక అలాగే వదిలేశారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
చిన్నశంకరంపేట, డిసెంబర్ 7: చిన్నశంకరం పేటతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో శనివారం భారీవర్షం కురిసింది.