పాపన్నపేట్, సెస్టెంబర్ 6: ఇటీవల కురిసిన వర్షాలకు తోడు సింగూరు ప్రాజెక్టు గేట్లు తెరవడంతో మెదక్ జిల్లా పాపన్నపేట్ మండలంలోని వనదుర్గా ప్రాజెక్టు పొంగిపొర్లుతున్నది. ఏడుపాయల వనదుర్గమాత ఆలయం జల దిగ్బంధంలో చిక్కుకుంది. కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున్న వర్షాలు కురుస్తుండడంతో పాటు సింగూరు ప్రాజెక్టు గేట్లు తెరవడంతో 20వేల క్యూసెక్కుల నీరు ఘన్పూర్ (వనదుర్గప్రాజెక్టు) వైపు పరుగులిడుతున్నది.
దీంతో ప్రాజెక్టు పైనుంచి పెద్దఎత్తున నీరు దుర్గామాత ఆలయం ముందు నుంచి నిజాంసాగర్ వైపు వెళ్తున్నది. దీం తో అమ్మవారి ఆలయం కొన్ని రోజుల నుంచి మూ సివేసి రాజగోపురంలో పూజలు చేస్తున్న విషయం తెలిసిందే. మంజీరా ప్రవాహం తగ్గితే అమ్మవారి ఆలయం పునఃప్రారంభించే అవకాశాలు ఉన్నా యి. ఏడుపాయల్లో ఎలాంటి ఘటనలు జరగకుం డా పాపన్నపేట ఎస్త్సె శ్రీనివాస్‌గౌడ్ పకడ్బందీ చర్యలు చేపట్టారు.