Open School Exams | మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 19 : ఓపెన్ స్కూల్ పరీక్షలు ఇవాళ ప్రారంభమయ్యాయి. పరీక్షలు ఈ నెల 26 వరకు కొనసాగనున్నాయి. మెదక్ జిల్లాలో పదో తరగతికి 459 మంది, ఇంటర్మీడియట్‌కు 875 మంది పరీక్షలు రాయనున్నారు. ప్రతీ రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
పదో తరగతి కోసం మెదక్, నర్సాపూర్, తూప్రాన్లలో ఒక్కొక్కటి చొప్పున పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా.. ఇంటర్ కోసం మెదక్‌లో 2, నర్సాపూర్‌లో 2, తూప్రాన్‌లో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పరీక్ష రాసే అభ్యర్థులను గుర్తించడానికి డైరెక్టర్ ఆదేశాల మేరకు ప్రతీ అభ్యర్థి హాల్ టికెట్‌తోపాటు ఆధార్‌కార్డు కానీ.. ఫొటో స్పష్టంగా కనిపించే గుర్తింపు కార్డును కానీ తప్పనిసరిగా తీసుకొని రావాలని అధికారులు సూచిస్తున్నారు. 5 నిమిషాలకు మించి ఆలస్యంగా వస్తే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబడదన్నారు.
ప్రతీ పరీక్షా కేంద్రంలో ఒక సిట్టింగ్ స్క్వాడ్‌తో పాటు ఇద్దరు ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించారు. వేసవి దృష్ట్యా పరీక్ష కేంద్రాల్లో తాగు నీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు.
Inter Results | ఈనెల 22న ఇంటర్ ఫలితాలు..
Dilip Ghosh | 60 ఏళ్ల వయసులో ప్రేయసిని పెళ్లాడిన బీజేపీ నేత.. ఫొటోలు వైరల్