అక్కన్నపేట, అక్టోబర్ 31: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని మల్లంపల్లి గ్రామానికి చెందిన పుల్లూరి రామకృష్ణ(25) వరదలో కొట్టుకుపోయి మృతిచెందాడు. మృతదేహాన్ని శుక్రవారం రైతులు పొలాల్లో గుర్తించారు. గ్రామస్తులు, పోలీసుల వివరాల ప్రకారం.. మల్లంపల్లికి చెందిన పుల్లూరి రామకృష్ణ తన బైక్‌పై బుధవారం రాత్రి మల్లంపల్లి నుంచి హుస్నాబాద్‌కు బయలుదేరాడు. ఊరి చివరిలోని లోలెవల్ బ్రిడ్జి దాటుతుండగా వరద ఉధృతిలో బైక్‌తో సహా కొట్టుకుపోయాడు. కుటుంబీకులు తమ కుమారుడు హుస్నాబాద్‌లోని అత్తగారింటికి వెళ్లాడని అనుకున్నారు.
గురువారం ఉదయం ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో అనుమానం వచ్చి కుమారుడి ఆచూకీ కోసం బంధువులు, స్నేహితులు, తెలిసిన వారి ఇండ్లలో వెతికారు. శుక్రవారం ఉదయం గ్రామ సమీపంలోని రైతులు పొలాల మధ్య ఇసుక మేటల్లో కూరుకుపోయిన మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని బయటకు తీయగా, రామకృష్ణగా గుర్తించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. రామకృష్ణకు ఆరునెలల క్రితం హుస్నాబాద్‌కు చెందిన ఓ యువతితో వివాహం అయ్యింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.