సిద్దిపేట, మే 8: ఆయిల్‌పామ్ సాగు రైతులకు లాభదాయకం అని, జిల్లాలో లక్ష్యమేర సాగును ప్రోత్సహించాలని, అన్ని రైతువేదికల్లో రైతులతో సమావేశాలు నిర్వహించి వారిని ఒప్పించాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో ఆయిల్‌ఫెడ్, వ్యవసాయ,ఉద్యానవన శాఖ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.
జిల్లాలో ఇప్పటి వరకు 12,339 ఎకరాల్లో ఆయిల్‌పామ్ పంట సాగవుతున్నదని, 2025-26సంవత్సరానికి 6500 ఎకరాల లక్ష్యం పెట్టుకున్నట్లు జిల్లా ఉద్యానవన శాఖ అధికారి తెలిపారు. ఇప్పటి వరకు 665 ఎకరాల్లో సాగుకు 188 మంది రైతులను గుర్తించామని తెలిపారు. జిల్లాలో నుంచి 209 మంది రైతులకు చెందిన 492 టన్నుల ఆయిల్‌పామ్ గెలలు కటింగ్ చేసి ఖమ్మం జిల్లా అశ్వారావుపేట ఫ్యాక్టరీకి పంపినట్లు తెలిపారు.అనంతరం ఉద్యానవన శాఖ జారీచేసిన ఆయిల్‌పామ్ సాగు కరపత్రాలను అధికారులతో కలిసి అదనపు కలెక్టర్ ఆవిషరించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆయిల్‌పామ్ సాగుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. నర్మెట వద్ద రూ. 300 కోట్లతో ఆయిల్‌పామ్ కర్మాగారం నిర్మాణం జూన్లోపూ పూర్తి అవుతుందని తెలిపారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి రైతులకు ఆయిల్‌పామ్ సాగు లాభాల గురించి వారిని సాగుకు ఒప్పించాలన్నారు.
ఆయిల్‌పామ్ సాగులో దశలు రైతులను ఎంపిక చేయడం, డీడీ కలెక్షన్లు, మారింగ్, డ్రిప్ ఫిట్టింగ్, మొకలు పెట్టడం అనే పక్రియను వెంట వెంటనే పూర్తి చేయాలన్నారు. వ్యవసాయ , ఉద్యాన వన , ఆయిల్‌ఫెడ్ కార్పొరేషన్ అధికారులందరూ సమన్వయంతో వ్యవహరించి వందశాతం సాగు లక్ష్యాన్ని పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాధిక, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సువర్ణ, సిబ్బంది పాల్గొన్నారు.