తాగునీటి పునరుద్ధరణ
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రాఘవపూర్ శివారులోని మిషన్ భగీరథ పథకం తాగునీటి సరఫరాను శుక్రవారం సంబంధిత అధికారులు పునరుద్ధ్దరించారు. ఈ నెల 16వ తేదీన ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురితమైన ‘పొంచి ఉన్న గండం’ అనే కథనానికి సంబంధిత మిషన్ భగీరథ పథకం అధికారులు స్పందించారు.
- స్పందించిన మిషన్ భగీరథ అధికారులు
జహీరాబాద్, ఏప్రిల్ 17 : సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రాఘవపూర్ శివారులోని మిషన్ భగీరథ పథకం తాగునీటి సరఫరాను శుక్రవారం సంబంధిత అధికారులు పునరుద్ధ్దరించారు. ఈ నెల 16వ తేదీన ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురితమైన ‘పొంచి ఉన్న గండం’ అనే కథనానికి సంబంధిత మిషన్ భగీరథ పథకం అధికారులు స్పందించారు. సింగూరు ప్రాజెక్టు అనకట్ట మరమ్మతుల దృష్ట్యా దిగువకు నీటిని వదలడంతో మంజీరానదిలో నీటి మట్టం తగ్గింది.
ఫలితంగా మంజీరానది తీరంలో రాఘవపూర్ గ్రామ శివారులోని ఇన్టెక్వెల్కు నీరు చేరకపోవడంతోపాటు పూడిక నిండిపోవడం వల్ల నీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తిన విషయం తెలిసిందే. ఐదారు రోజులుగా రాఘవపూర్ గ్రామ శివారులోని మిషన్ భగీరథ పథకం ఫిల్టర్ బెడ్ నుంచి న్యాల్కల్, ఝరాసంగం, రాయికోడ్ మండలాల పరిధిలోని 74 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ఆయా గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురితం కావడంతో సంబంధిత జిల్లా అధికారులు స్పందించారు. వెంటనే తగు చర్యలు తీసుకుని మంజీరానది తీరంలోని ఇన్టెక్వెల్ సమీపంలో జేసీబీతో పూడికతీత పనులను యుద్ధప్రాతిపదిక చేపట్టారు.
మంజీరానదిలో ఉన్న నీటిని ఇన్టెక్వెల్కు చేరేలా కాలువలు తవ్వించి ఆయా మండలాలకు తాగునీటిని పునరుద్ధ్ధరించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. తాగునీటి సరఫరా తిరిగి ప్రారంభం కావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. రాయికోడ్ మండలంలోని షాపూర్ మిషన్ భగీరథ పథకం ద్వారా నీటి సరఫరా చేపడుతున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఆయా మండలాల పరిధిలో నెలకొన్న తాగునీటి సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ల్లేలా నమస్తే తెలంగాణ దినపత్రిక చేసిన కృషికి ఆయా మండలాల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Market | భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 1,109 పాయింట్లు లాభం
అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ప్రజల్లో అవగాహణ ఎంతో అవసరం
Jatayu | ‘రామాయణం’లో జటాయువుగా అనుపమ్ ఖేర్!
CPR | సీపీఆర్ అంటే ఏమిటి.. హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు ఇది ఎందుకు కీలకం..
రాష్ట్రస్థాయి ఖో-ఖో పోటీలకు భీమవరం విద్యార్థినులు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

