మొలకెత్తిన ధాన్యంతో రైతుల రాస్తారోకో
వానలకు ధాన్యం తడిసి మొలకెత్తిందని, ధాన్యం కొనుగోలు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని అన్నదాతలు రోడ్డెక్కారు. ఆదివారం మెదక్ జిల్లా రామాయంపేట మండ లం డి.ధర్మారంలో రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపారు.రామాయంపేట-గజ్వేల్ రహదారిపై గంటపాటు బైఠాయించారు.
- మృగశిక కార్తె వచ్చినా ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నా చేపట్టిన రామాయంపేట మండలం డి.ధర్మారం రైతులు
రామాయంపేట, జూన్ 7: వానలకు ధాన్యం తడిసి మొలకెత్తిందని, ధాన్యం కొనుగోలు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని అన్నదాతలు రోడ్డెక్కారు. ఆదివారం మెదక్ జిల్లా రామాయంపేట మండ లం డి.ధర్మారంలో రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపారు.రామాయంపేట-గజ్వేల్ రహదారిపై గంటపాటు బైఠాయించారు. రెండు నెలలుగా తమ ధాన్యం రోడ్డుపైన, కొనుగోలు కేంద్రాల్లోనే ఉందని, ఇంతవరకు ధాన్యం తరలించడం లేదని అధికారులపై రైతులు మండిపడ్డారు.
మృగశిక కార్తె వచ్చిందని, మళ్లీ పంట లు వేసుకునే సమయం వచ్చినా చేతికి వచ్చిన ధాన్యం ఇంతవరకు పోలేదని, తాము మళ్లీ వ్యవసాయ పనులు ఎలా చేసుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు కొంత మంది రైతుల ధాన్యం తూకం వేశారని, ఇంకా వందల క్వింటాళ్ల ధాన్యం కాంటాకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రైతులు ధర్నా విషయం తెలుసుకున్న రామాయంపేట ఎస్సై బాలరాజు సిబ్బందితో అక్కడికి చేరుకుని రైతులను సముదాయించారు. రైతులు వినకపోవడంతో తహసీల్దార్ రజినీకుమారితో ఫోన్లో మాట్లాడించారు. అనంతరం అక్కడికి చేరుకున్న డిప్యూటీ తహసీల్దార్‌తో ఎస్సై బాలరాజు మంతనాలు జరిపి ధాన్యం ఈ రోజే తరలిస్తామని చెప్పడంతో రైతులు శాంతించారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

